Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ రెజీనా ని ఎందుకు దూరం పెట్టాడంటే..?

సినిమాలో హీరోయిన్ గా రేజిననటించింది.ఇక ఈ సినిమా లో ఏర్పడిన పరిచయం తో రెజీనాతో కొద్దిరోజుల పాటు ఈయన చాలా మంచి ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్  రెజీనా ని ఎందుకు దూరం పెట్టాడంటే..?

Follow us on

Sai Dharam Tej: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తు ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కూడా తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఈయన చేసిన తన మొదటి సినిమా అయిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రేజిననటించింది.ఇక ఈ సినిమా లో ఏర్పడిన పరిచయం తో రెజీనాతో కొద్దిరోజుల పాటు ఈయన చాలా మంచి ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే తన తర్వాత సినిమా అయినా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా సాయి దరం తేజ్ తనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతూ అది రిలేషన్ షిప్ కూడా దారి తీసింది అని అప్పట్లో వార్తలు చాలానే వచ్చాయి…

ఇక ఇదే క్రమంలో రెజినా మరో నటుడు అయిన సందీప్ కిషన్ తో కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ఇలాంటి క్రమంలో రెజినా సందీప్ కిషన్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసింది. అలా సందీప్ కిషన్ తో రొటీన్ లవ్ స్టోరీ, నక్షత్రం లాంటి సినిమాల్లో కలిసి నటించింది.ఇక ఈ క్రమంలో రెజినా వేరే హీరోలతో క్లోజ్ గా ఉండటం నచ్చని సాయి ధరమ్ తేజ్ చాలా ఎమోషనల్ గా అప్పట్లో ఒక ట్వీట్ కూడా చేశాడు. మనం కొంతమందితో కలిసి ఉండాలి అనుకుంటాం కానీ కొంతమంది మనల్ని వాడుకుంటూ ఉంటారు అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేశాడు.ఇక రెజినా ని ఉద్దేశించే సాయి ధరమ్ తేజ్ ఇలా ట్వీట్ చేశాడు అంటూ అభిమానులు పలు రకాల కథలను అల్లుకున్నారు.

ఇక అప్పటి నుంచి తను రెజినాతో సినిమాలు చేయడం లేదు. ఆ విధంగా సందీప్ కిషన్ వల్ల వాళ్ల ఫ్రెండ్షిప్ అనేది చెడిపోయిందనే చెప్పాలి. ఇలా సాయి ధరమ్ తేజ్ రెజీనా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది దూరం అయింది.ఆ తర్వాత రెజీనా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తనకు మార్కెట్ తగ్గిపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేసింది. అవి కూడా ఆమె పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ చేస్తూ ముందుకు వెళుతుంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు