Odi World Cup 2023: టీమిండియా విజయాల వెనక ఉన్న ఆ ఒక్కడు ఎవరంటే..?

ముఖ్యంగా ఇండియన్ టీం ఆడిన 8 మ్యాచుల్లో ఐదు మ్యాచ్ ల్లో చేజింగ్ చేసింది. చేజింగ్ లో కూడా ప్రత్యర్థి జట్టుపై మన బౌలర్లు విరుచుకుపడి బౌలింగ్ చేస్తూ అద్భుతంగా వికెట్లను తీయడం జరిగింది.

  • Written By: Gopi
  • Published On:
Odi World Cup 2023: టీమిండియా విజయాల వెనక ఉన్న ఆ ఒక్కడు ఎవరంటే..?

Follow us on

Odi World Cup 2023: ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇండియన్ టీమ్ అద్భుతాలను చేస్తూ వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతుంది.ఇక ఇదే క్రమంలో ఈ వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ వరుసగా 8 విజయాలను సొంతం చేసుకుని వరల్డ్ కప్ హిస్టరీలోనే కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఇంతకుముందు ఇండియా సాధించిన విజయాలు మొత్తం బ్యాటింగ్ స్పిన్ బౌలింగ్ తో సాధించడమే కావడం విశేషం.కానీ మొదటిసారి ఈ వరల్డ్ కప్ లో ఫేస్ బౌలింగ్ విభాగంలో మన బౌలర్లు మంచి ప్రదర్శన ని కనబరుస్తూ ప్రతి టీం మీద ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకుంటూ వస్తున్నారు.

ముఖ్యంగా ఇండియన్ టీం ఆడిన 8 మ్యాచుల్లో ఐదు మ్యాచ్ ల్లో చేజింగ్ చేసింది. చేజింగ్ లో కూడా ప్రత్యర్థి జట్టుపై మన బౌలర్లు విరుచుకుపడి బౌలింగ్ చేస్తూ అద్భుతంగా వికెట్లను తీయడం జరిగింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి జట్లను 200 పురుగుల లోపు ఆలౌట్ చేసి మన పేస్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మన బౌలర్లు ప్రూవ్ చేశారు.ఇక ముఖ్యంగా ఇండియన్ ఫేస్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్ర, మహమ్మద్ షమీ,మహమ్మద్ సిరాజ్ వీళ్ల ముగ్గురితోనే ఆడిస్తూ ఇండియా ప్రస్తుతం అద్భుతాలను చేస్తుంది. ఇండియన్ పిచ్ లు ఎక్కువగా స్పిన్ కి అనుకూలుస్తాయి. కానీ ఈ పిచ్ ల పైన కూడా మన పేస్ బౌలర్లు విజృంభిస్తూ ప్రతి టీంని కూడా చాలా తక్కువ స్కోర్ కి అలౌట్ చేస్తున్నారు. అలాగే వరల్డ్ లోనే బెస్ట్ బ్యాట్స్ మెన్స్ గా కొనసాగుతున్న సౌతాఫ్రికా టీమ్ ని సైతం 83 పరుగులకే అలవాటు చేశారు…

ప్రస్తుతం టీం లో ఉన్న ముగ్గురు పేస్ బౌలర్లు కూడా 140 స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ టీమ్ కి అద్భుతమైన విజయాలను అందించేవారు కావడం విశేషం…అయితే ఇండియన్ టీమ్ లో ఇంతకు ముందు ఉన్న ఫాస్ట్ బౌలర్లు అయిన కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా,ఇర్ఫాన్ పఠాన్ ,అజిత్ అగర్కర్ లాంటి పేస్ బౌలర్లు ఉన్న కూడా వీళ్లంతా ఒక్కసారి అందరూ ఫామ్ లో ఉన్నది చాలా తక్కువ సార్లు అనే చెప్పాలి.కానీ ఇప్పుడు టీమ్ లో ఉన్న ఈ ముగ్గురు పేసర్లు వాళ్ల స్థాయి మేరకు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు…ఇక మన పేసర్లు మునుపెన్నడూ లేని విధంగా ఇలా విరుచుకుపడటం వెనకాల ఉన్నది మన ఇండియన్ టీమ్ బౌలింగ్ కోచ్ అయిన పరాస్ మాంబ్రే ఆయన కోచ్ గా వచ్చినప్పటి నుంచే ఇండియన్ టీమ్ అద్భుతాలు చేస్తుంది. నిజానికి ఈయన మొదటి నుంచి కూడా పేస్ బౌలింగ్ ని స్ట్రాంగ్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన అనుకున్నట్టు గానే ఇండియన్ టీమ్ పేస్ విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంది…
అయితే అసలు ఈ పరాస్ మాంబ్రే ఎవరు అంటే ఈయన 1972 జూన్ 20 వ తేదీన ముంబై లో జన్మించారు..ఇక ఈయన తన చిన్న తనం నుండే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాడు ఇక దాంతో ఆయన వాళ్ల నాన్నతో క్రికెటర్ అవుతా అని చెప్పడం తో వాళ్ల నాన్న సచిన్ కి కోచింగ్ ఇచ్చిన అజయ్ మంజ్రేకర్ దగ్గర శిక్షణ ఇప్పించాడు…అలా క్రికెట్ అంటే ప్రాణం పెట్టీ ఆడిన ఆయన అనతి కాలం లోనే మంచి ప్లేయర్ గా గుర్తింపు పొందాడు…ఇక తన కెరీర్‌లో 91 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడితే అందులో 284 వికెట్లు తీశాడు, అలాగే 83 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 111 వికెట్లు తీశాడు…

కానీ ఆయన అంతర్జాతీయ స్థాయి లో టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడలేక పోయాడు కేవలం 3 వన్డేలు, 2 టెస్టులు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 2, వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈయనకి అప్పట్లోనే 1996 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ ఆ క్యాంప్ లో ఆడే మరో నాలుగురు బౌలర్లు వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్, మనోజ్ ప్రభాకర్, సలీల్ అంకోలా మంచి ప్రదర్శన ఇవ్వడం తో ఈయన ఆడాల్సిన మ్యాచ్ లోకి వాళ్ళు వచ్చి ఆడారు దాంతో వరల్డ్ కప్ లో ఆడే అవకాశం మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఇండియా-ఏ టీమ్‌కు కోచ్‌గా పనిచేసిన ఆయన అక్కడ ఇండియన్ టీమ్ కి అద్భుతమైన విజయాలను అందించి ఇక అనతి కాలం లోనే టీమిండియా సీనియర్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యారు
ఇక ఆయన నేతృత్వంలోనే టీమిండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు…
ఇక ఇండియన్ టీమ్ ప్రస్తుతం పేస్ విభాగంలో స్ట్రాంగ్ గా కావడానికి మెయిన్ రిజన్ ఈయనే కావడం విశేషం…ఇక ముందు ముందు కూడా ఈయన వేసిన బాట లో ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్ రాణించాలని కోరుకుందాం…అలాగే ఈ వరల్డ్ కప్ కొట్టి ఆయనకి అంకితం ఇవ్వాలని టీమ్ ఇండియా ప్లేయర్లు కూడా కోరుకుంటున్నారు…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు