Mahesh Babu Rajamouli: ప్రభాస్ పరిస్థితే మహేష్ బాబుకు? రాజమౌళితో సినిమా.. మహేష్ కెరీర్ ఏంటి?

పలువురు స్టార్ హీరోలు అందరూ కూడా రాజమౌళితో కొన్ని సంవత్సరాల పాటు కలిసి జర్నీ చేసి సినిమాలను పూర్తి చేశారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ చేసిన రాజమౌళి ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే.

  • Written By: Suresh
  • Published On:
Mahesh Babu Rajamouli: ప్రభాస్ పరిస్థితే మహేష్ బాబుకు? రాజమౌళితో సినిమా.. మహేష్ కెరీర్ ఏంటి?

Follow us on

Mahesh Babu Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఫ్లాప్ లేకుండా సాటి లేని దర్శకుడిగా ఎదిగాడు రాజమౌళి. తెలుగు సినిమా సత్తాను ప్రపంచంలో నిలబెట్టిన స్థాయి కూడా జక్కన్నదే. అయితే ఈయన సినిమాలు తీయాలంటే చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవరు. ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఆ సినిమా మాత్రం సక్సెస్ అవుతుంది. ఏ హీరో అయినా రాజమౌళి కాంపౌండ్ లోకి అడుగుపెట్టారంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల మరో సినిమా గురించి ఆలోచించవద్దు అనే టాక్ ను కూడా మూటగట్టుకున్నారు. వేరే సినిమా చేయడానికి అవకాశం లేకుండా రాజమౌళి సినిమాతోనే బిజీగా ఉండాల్సిందే.

పలువురు స్టార్ హీరోలు అందరూ కూడా రాజమౌళితో కొన్ని సంవత్సరాల పాటు కలిసి జర్నీ చేసి సినిమాలను పూర్తి చేశారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ చేసిన రాజమౌళి ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్ట్రిప్ట్ మొత్తం విజయేంద్రప్రసాద్ పూర్తి చేశారట. దీనికి తుదిమెరుగులు రాజమౌళి దిద్దుతున్నారని టాక్. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపిస్తారు? లుక్ ఎలా ఉండబోతుంది అనే చర్చ కూడా సాగాయట.

గుంటూరు కారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందకు రానుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఇది ఇండియానా జోన్స్ తరహాలో ఉండే సినిమా అని చెప్పడం వల్ల తప్పకుండా రెండో భాగం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

రాజమౌళి కాంపౌండ్ లోకి అడుగు పెడితే నాలుగేళ్లు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ప్రభాస్ కూడా గతంలో బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పనిచేశారని, ఇప్పుడు మహేష్ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక వైపు తమ హీరో రాజమౌళితో సినిమా చేస్తున్నారన్న ఆనందం ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాల పాటు ఈయన మరో సినిమా చేసే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు మహేష్ అభిమానులు. కానీ రాజమౌళితో సినిమా అంటే ఆ రేంజ్ కూడా ఊహించని విధంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు