Ye Maaya Chesave: ఏమాయ చేశావే సినిమా కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ జరిగిందా? అందుకే సమంత ఆ పని చేసిందా?

ఏమాయ చేశావే సినిమా కెరీర్ పరంగా ప్లస్ అయితే.. పర్సనల్ పరంగా మైనస్ గా మారింది. అక్కినేని ఇంటి కోడలు అవగానే ఎందరో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది.

  • Written By: Suresh
  • Published On:
Ye Maaya Chesave: ఏమాయ చేశావే సినిమా కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ జరిగిందా? అందుకే సమంత ఆ పని చేసిందా?

Follow us on

Ye Maaya Chesave: కొందరు స్టార్లు మొదటి సినిమాతోనే ఫేమస్ అవుతుంటారు. మరికొందరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫేమస్ అవడం కష్టమే అని చెప్పాలి. కానీ సమంత మాత్రం టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. మొదటి సినిమాతోనే వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. సామ్ నటించిన మొదటి టాలీవుడ్ సినిమా ఏమాయ చేసావే. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించి.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఇదే సినిమాతో నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటి కోడలు అయింది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది సామ్.

ఏమాయ చేశావే సినిమా కెరీర్ పరంగా ప్లస్ అయితే.. పర్సనల్ పరంగా మైనస్ గా మారింది. అక్కినేని ఇంటి కోడలు అవగానే ఎందరో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. మనస్పర్థాల వల్ల ఇద్దరు కూడా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే ఆ సినిమా కోసం ఎంతో మందిని సంప్రదిస్తుంటారు మేకర్స్. అదే విధంగా ఏమాయ చేశావే సినిమా కోసం కూడా హీరోయిన్ గా సమంతను, మరో హీరోయిన్ ను కూడా సంప్రదించారట గౌతమ్ మీనన్.

ఈ ఇద్దరిలో ఎవరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయాలో అర్థం కాక తెగ సతమత పడ్డారట. దీంతో ఇద్దరికి ఓ టాస్క్ ఇచ్చారట గౌతమ్. అయితే ఈ టాస్క్ లో నెగ్గిన సామ్ ఏ మాయ చేసావే సినిమాలో హీరోయిన్ రోల్ ను సంపాదించింది. అయితే ఈ సినిమా సమయంలో సమంత 10 ఆడిషనన్ వే ఆఫప్ స్టైల్స్ కి ఫిదా అయిన గౌతమ్ మీనన్ ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట. అంతేకాదు ఇప్పటికీ సమంత లో ఉన్న వెరైటీ యాక్టింగ్ స్కిల్స్ గౌతమ్ మీనన్ మర్చిపోలేక పోతున్నారని టాక్. ఆ కారణంతోనే సమంత అనారోగ్యం ఆమె మొహం పీలగా మారిపోయినా కూడా మళ్లీ మళ్లీ ఆమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని టాక్.

మొత్తం మీద సమంతలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ ఆమెకు ఏమాయ చేశావే సినిమాలో ఛాన్స్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్ టాక్ ను సంపాదించి ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఫుల్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది సమంత.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు