Tollywood: తెలుగు లో నాన్న సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ అయిన సినిమాలు ఇవే…

అల్లు అర్జున్ హీరో గా, త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఒకటి… ఈ సినిమాలో వాళ్ల ఫాదర్ ని ఎవ్వరూ ఏం అనకూడదు, ఆయన కోసం ఏదైనా చేస్తాను అని అనుకునే ఒక కొడుకు కథ తో ఈ సినిమా తెరకెక్కింది.

  • Written By: Gopi
  • Published On:
Tollywood: తెలుగు లో నాన్న సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ అయిన సినిమాలు ఇవే…

Follow us on

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో టైంలో ఒక్కో రకమైన సినిమాల ట్రెండు నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు లవ్ స్టోరీస్ నడిస్తే మరి కొన్నిసార్లు థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా నడుస్తుంటాయి.ఇక ఇప్పుడు అనే కాదు ఎప్పుడు వచ్చిన నడిచే ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫుల్ స్టోరీస్ కొన్ని ఉంటాయి అందులో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు మొదటి వరుస లో ఉంటాయి… అయితే గడిచిన 10 సంవత్సరాల్లో తెలుగు లో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి మంచి విజయాలు సాదించిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…

ఇందులో ముందుగా అల్లు అర్జున్ హీరో గా, త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఒకటి… ఈ సినిమాలో వాళ్ల ఫాదర్ ని ఎవ్వరూ ఏం అనకూడదు, ఆయన కోసం ఏదైనా చేస్తాను అని అనుకునే ఒక కొడుకు కథ తో ఈ సినిమా తెరకెక్కింది. త్రివిక్రమ్ ఈ సినిమా బాగా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.

ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా నాన్న ని మోసం చేసిన వాడి మీద నాన్న కోసం కొడుకు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనే పాయింట్ తో వచ్చి గొప్ప విజయాన్ని అందుకుంది.ఇక ఈ రెండు సినిమాలు కూడా పెద్ద సినిమాలు కావడం విశేషం…అలాగే ఈ సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన చాలా సినిమాలకి స్ఫూర్తి గా నిలిచాయి.

ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ ని కనక ఒకసారి చూసుకుంటే నాన్న కి ఆపద వస్తే కొడుకు ఎలా ఆదుకుంటాడు, అలాగే వాళ్ళ నాన్నని చంపాలని చూసిన వాళ్ళని కొడుకు ఏ విధంగా చంపి వాళ్ల నాన్న ని కాపాడుకుంటాడు అనే కాన్సెప్ట్ ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఇలాంటి ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా దెబ్బకి ఇంతకుముందు వచ్చిన సినిమాల రికార్డులన్నీ బ్రేక్ అవుతుండటం విశేషం…ఇది సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద హిట్ గా నిలుస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం సందేహం లేదు. రన్బీర్ కపూర్ కెరియర్ లో ఇది ఒక గొప్ప సినిమాగా నిలిచిపోతుంది అని సినిమా రిలీజ్ కి ముందే సినిమా యూనిట్ చెప్పింది.ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఈ సినిమా మంచి విజయం సాధించింది…

ఇక ఇది ఇలా ఉంటే నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమా ఈ వారం లో రిలీజ్ కావడానికి రెఢీ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు….

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు