Rajinikanth: తన కథ తో రజినీకాంత్ ని మెప్పించిన తెలుగు స్టార్ డైరెక్టర్…

రజినీకాంత్ ఏదైనా కథ ఉంటే చెప్పమని అప్పుడే గోపీచంద్ మలినేని ని అడగగా మంచి కథ రెడీ చేసిన తర్వాత చెప్తానని చెప్పాడు.

  • Written By: Gopi
  • Published On:
Rajinikanth: తన కథ తో రజినీకాంత్ ని మెప్పించిన తెలుగు స్టార్ డైరెక్టర్…

Follow us on

Rajinikanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకుపోతుంటే మరి కొంతమంది డైరెక్టర్లు తీసిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో ఒకే హీరో తో వరుసగా మూడు హిట్లు కొట్టి తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలియజేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని…

ఆయన తీసిన ఏడు సినిమాల్లో మూడు సినిమాలు రవితేజతోనే తీసి మంచి విజయాలను అందుకున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇయర్ సంక్రాంతికి బాలయ్య బాబుతో వీరసింహారెడ్డి అనే సినిమా చేసి సక్సెస్ అందుకోవడం తోపాటు బాలయ్య బాబు కెరియర్ లో 100 కోట్ల కలెక్షన్లను వసుల్ చేసిన సినిమాగా ఈ సినిమాను నిలిపాడు… ఇక ఇప్పుడు ఆయన రవితేజ తో మరో సినిమా చేస్తూ ఉంటే ఓవర్ బడ్జెట్ వలన ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజులు ఆ సినిమాని హోల్డ్ లో పెట్టారు.అయితే వీర సింహారెడ్డి సినిమా తీసినప్పుడు ఆ సినిమా చూసిన రజినీకాంత్ గోపీచంద్ మలినేని పిలిపించుకొని మరి ఈ సినిమా బాగా తీసినందుకు ఆయనను అప్రిషేట్ చేశాడు.

ఇక దాంతో రజినీకాంత్ ఏదైనా కథ ఉంటే చెప్పమని అప్పుడే గోపీచంద్ మలినేని ని అడగగా మంచి కథ రెడీ చేసిన తర్వాత చెప్తానని చెప్పాడు. ఇక దాంతో ఇప్పుడు రవితేజతో సినిమా ఆగిపోవడంతో రజినీకాంత్ కోసం రాసుకున్న సినిమా కథని ఆయన కి చెప్పి ఒప్పించి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టి ప్రయత్నంలో గోపీచంద్ మలినేని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రజినీకాంత్ సినిమా ఓకే అయితే మాత్రం గోపీచంద్ మలినేని పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ రజినీకాంత్ ఒకటి రెండు ప్రాజెక్టులని ఒప్పుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ లు ఏవి కూడా ప్రస్తుతానికిసెట్స్ మీదకి వెళ్లడం లేదు కాబట్టి రజినీకాంత్ కూడా ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

రవితేజ ప్రాజెక్టు ఆగిపోయినందుకు గోపీచంద్ మలినేని కి ఈ సినిమాతో మంచి ఆఫర్ దొరికింది అంటూ ట్రేడ్ పండితులు సైతం గోపిచంద్ మలినేని లక్కు గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా ఈ సినిమా చేస్తే మాత్రం గోపిచంద్ మలినేని లక్ అనేది తిరిగి పోతుందనే చెప్పాలి…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు