Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill: పెళ్లి కాకముందే..గిల్ మొదలుపెట్టాడు.. ఏం ప్లానింగ్ భయ్యా..

Shubman Gill: పెళ్లి కాకముందే..గిల్ మొదలుపెట్టాడు.. ఏం ప్లానింగ్ భయ్యా..

Shubman Gill: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ సామెతను చాలామంది చాలా విధాలుగా అమలులో పెడుతుంటారు. టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ మాత్రం మరో విధంగా అమలు చేస్తున్నాడు. ఇతడి ప్లానింగ్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంతటి దూర దృష్టి.. దీర్ఘ ఆలోచన ఏంటని చర్చించుకుంటున్నారు. గిల్ ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ జట్టుకు వన్డే.. టెస్ట్ ఫార్మేట్లో సారధిగా ఉన్నాడు. ఇప్పుడు తిరుగులేని ఫామ్ […]

Shubman Gill: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ సామెతను చాలామంది చాలా విధాలుగా అమలులో పెడుతుంటారు. టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ మాత్రం మరో విధంగా అమలు చేస్తున్నాడు. ఇతడి ప్లానింగ్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంతటి దూర దృష్టి.. దీర్ఘ ఆలోచన ఏంటని చర్చించుకుంటున్నారు.

గిల్ ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ జట్టుకు వన్డే.. టెస్ట్ ఫార్మేట్లో సారధిగా ఉన్నాడు. ఇప్పుడు తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎటువంటి స్థితిలోనైనా సరే అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చిన్న వయసులోనే మెచ్యూర్డ్ క్రికెట్ ప్లేయర్ గా వ్యవహరిస్తున్నాడు. అతడి తీరు చూసి సీనియర్ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఆటకు తగ్గట్టుగానే గిల్ సంపాదన ఉంది. ఒక నివేదిక ప్రకారం అతడు అన్ని రూపాలలో సంవత్సరానికి 50 నుంచి 70 కోట్ల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంపాదించిన డబ్బులు అతడు సక్రమమైన మార్గాలలో పెట్టుబడులుగా పెడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అతడు ముంబైలోని జుహు ప్రాంతంలో ఓ ఖరీదైన ఏరియాలో ప్లాట్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఓ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉండేలాగా గిల్ చూసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2029 వరకు పనులు పూర్తయి.. అందుబాటులోకి వస్తుందని సమాచారం.

గిల్ ఆర్థిక వ్యవహారాలు మొత్తం అతని కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. అతని తండ్రి సలహాతోనే గిల్ ముంబై ప్రాంతంలో ఈ స్థలం కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్లు.. ఈ ఇంటి నిర్మాణం కోసం పనిచేస్తున్నారు.. వారంతా రాత్రి పగలు కష్టపడుతున్నారు.

గిల్ నిర్మించే ఇంటిలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించబోతున్నారు. దీనికోసం రకరకాల మోడల్స్ పరిశీలించారు. అంతర్జాతీయ నిపుణులు కూడా పనిచేస్తున్నారు. విశాలమైన స్థలం.. ముంబై నగరంలో ఉండడం..ఇన్ని రకాల సానుకూలతలు ఉన్నాయి కాబట్టి.. గిల్ ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. పైగా జాతీయ జట్టులోని మెజారిటీ ప్లేయర్లు ఎక్కువగా ముంబైలో ఉంటున్నారు. అలాంటప్పుడు గిల్ కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ముంబైలో సెలబ్రిటీలు.. క్రికెట్ మైదానాలు.. ఇతర సౌకర్యాలు ఉన్నాయి. అందువల్లే గిల్ ముంబైలో అంతగా ఖర్చుపెట్టి గృహాన్ని నిర్మించుకుంటున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper