Homeక్రీడలుక్రికెట్‌Dhruv Jurel: 175 కొట్టిన కివీస్ బ్యాటర్ కు.. మన జురెల్ ఒంటి చేత్తో షాక్...

Dhruv Jurel: 175 కొట్టిన కివీస్ బ్యాటర్ కు.. మన జురెల్ ఒంటి చేత్తో షాక్ ఇచ్చాడు.. వైరల్ వీడియో

Dhruv Jurel: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు (డిక్లేర్) చేసింది. రిషబ్ పంత్ 128 పరుగులు చేసి అదరగొట్టాడు. కె.ఎల్ రాహుల్ ఇప్పటికే ఈ మ్యాచ్లో 136 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాటర్లు కూడా దుమ్ము రేపడంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 368 పరుగులకు ఆల్ అవుట్ […]

Dhruv Jurel: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు (డిక్లేర్) చేసింది. రిషబ్ పంత్ 128 పరుగులు చేసి అదరగొట్టాడు. కె.ఎల్ రాహుల్ ఇప్పటికే ఈ మ్యాచ్లో 136 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాటర్లు కూడా దుమ్ము రేపడంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 368 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కివీస్ జట్టులో నికోలస్ 175* పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ జట్టు ఈ స్టోరీ రాసే సమయం వరకు రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఓపెనర్ లాతం బుమ్రా బౌలింగ్లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాన్వే (33*), నికోలస్ (31) జాగ్రత్తగా ఆడటం మొదలుపెట్టారు. వీరిద్దరూ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం ప్రారంభించారు. రెండో వికెట్ 60 పరుగులు జోడించారు. ఈ దశలో కెప్టెన్ గిల్ ప్రసిద్ కృష్ణకు బంతి అందించాడు. కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా ప్రసిద్ బౌలింగ్ వేసాడు. అతడు వేసిన లో బౌన్సర్ ను నికోలస్ సరిగా అంచనా వేయలేకపోయాడు. అతడి బ్యాట్ హ్యాండ్ చివరికి తగిలి బంతి గాలిలో ఎగిరింది. అక్కడే ఫీలింగ్ చేస్తున్న ధృవ్ జూరెల్ బంతి గమనాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు దూకాడు ఒంటి చేతితో బంతిని అందుకున్నాడు. దీంతో నికోలస్ నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు . నికోలస్ అవుట్ కావడంతో 60 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.

భారత బ్యాటర్లు సిక్సర్లు కొడితే అభిమానులు ఎంతలా సంబర పడతారో.. ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నప్పుడు కూడా అంతే స్థాయిలో స్పందిస్తారు. ముఖ్యంగా అసాధ్యం అనిపించే క్యాచ్ లను ఒంటి చేత్తో అందుకున్నప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు టీమిండియా యువ క్రికెటర్ జురెల్ ఇలాంటి అద్భుతమైన ఫీల్డింగ్ తో వార్తల్లో నిలుస్తున్నాడు.

వెల్డింగ్టన్ వేదికగా జూరెల్ అందుకున్న క్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంతి తక్కువ ఎత్తులో లేచినప్పటికీ.. దాని గమనాన్ని అంచనా వేస్తూ.. ఏ మాత్రం తడబడకుండా అతడు అందుకున్న తీరు ఆకట్టుకుంటున్నది. మెరుపు వేగంతో చేతిని చాచి బంతిని పట్టేసుకున్నాడు. బంతి తన చేతిలో పడే వరకు దానిపైనే దృష్టి పెట్టి అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.

సాధారణంగా ఇలాంటి క్యాచ్ అందుకోవడం అంత సులభం కాదు. బంతి వేగం.. దిశ.. దూరాన్ని.. క్షణంలో అంచనా వేసి స్పందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని జూరెల్ ప్రదర్శించాడు. ఈ క్యాచ్ చూసిన అభిమానులు ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తూ అతడి ఫీల్డింగ్ తీరును ప్రశంసిస్తున్నారు..ఒంటి చేతితో పట్టిన క్యాచ్.. మ్యాచ్లో కీలక మలుపుగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. వికెట్ కీపర్ గా మాత్రమే కాకుండా మైదానంలో అద్భుతమైన ఫీల్డర్ గా జురెల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. గతంలో గాలే వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా జూరెల్ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అద్భుతమైన ఖ్యాతి అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper