India vs New Zealand: టెస్ట్ క్రికెట్ లో టీ మీడియా సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ గడ్డమీద జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లు వీరవిహారం చేశారు. పరుగుల వరద పారించారు. ఏకంగా 720 పరుగులు చేసి ప్రత్యర్థులకు భారీ సవాల్ విసిరారు వెల్డింగ్టన్ వేదికగా బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గిల్ నాయకత్వంలో భారత జట్టు సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టింది..
భారత తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 368 పరుగు కంటే భారత్ 352 పరుగుల భారీ లీడ్ సాధించింది ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డమీద ఇప్పటివరకు ఏ జట్టు చేయని అత్యధిక టెస్ట్ స్కోరును భారత్ నమోదు చేసింది. 96 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘనత.
భారత ఇన్నింగ్స్ లో కె.ఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 136 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ కు పునాది వేశాడు. రిషబ్ పంత్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు కేవలం 153 బంతుల్లో 128 పరుగులు చేశాడు ఇందులో 10 ఫోర్లు. 6 సిక్సర్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో జైస్వాల్ 85, రాహుల్ 136. దేవదత్ 80, గిల్ 98.. పంత్ 128.. కాంబోజ్ 38.. జురేల్ 78 పరుగులు చేశారు. గిల్ రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు.
న్యూజిలాండ్ లో 1930 నుంచి టెస్ట్ క్రికెట్ జరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ ఏ జట్టు కూడా 720 పరుగుల భారీ స్కోర్ చేయలేదు. 2019 లో హామీల్టన్ లో బంగ్లాదేశ్ మీద న్యూజిలాండ్ చేసిన 715/6 డిక్లేర్ స్కోర్ ఇప్పటివరకు అత్యధికంగా ఉండేది ఇప్పుడు భారత్ 720/9 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. విదేశీ గడ్డమీద భారత జట్టు చేసిన అత్యధిక టెస్ట్ స్కోర్ కూడా ఇదే. 2010లో కొలంబోలో శ్రీలంక పై భారత్ చేసిన 707/7 డిక్లేర్ స్కోర్ ను అధిగమించింది.
ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ప్రదర్శనలో మరో విశేషం ఉంది. తొలి అయిదుగురు బ్యాటర్లు అందరూ 50 పరుగులకు పైగా చేశారు. తొలి ఏడుగురులో ఆరుగురు అర్థ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఓకే ఇన్నింగ్స్ లో ఇంత మంది బాటర్లు ఆకట్టుకోవడం భారత జట్టు బలాన్ని చూపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ 720/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల లీడ్ లభించింది. దీంతో మ్యాచ్ మీద టీం ఇండియా పట్టు బిగించింది. మొత్తంగా చూస్తే విదేశీ గడ్డమీద భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్కోర్ నమోదు కావడం. న్యూజిలాండ్ లో 96 ఏళ్ల రికార్డు బద్దలు కావడం ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా నిలిచాయి. రాహుల్.. పంత్ సెంచరీలు.. గిల్.. జైస్వాల్.. పడకల్.. జూరెల్ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియా చరిత్ర సృష్టించింది.
EMOTIONS BY SUNIL GAVASKAR WHEN PANT COMPLETED THE HUNDRED 🥹❤️ https://t.co/xYrL4nhLrb
— Johns. (@CricCrazyJohns) November 22, 2026