IND vs NZ: కివీస్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్ లను టీమిండియా వరుసగా గెలిచింది. సిరీస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మ్యాచ్ లను న్యూజిలాండ్ గెలిచింది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఇప్పుడు వన్డే సిరీస్ మొదలు కాబోతోంది. నవంబర్ నాలుగో తేదీ నుంచి వన్డే సిరీస్ షురూ అవుతుంది. ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు.. వేదికలు.. మ్యాచ్ టైమింగ్స్.. జట్లు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం
- తొలి వన్డే.. నవంబర్ 4 బుధవారం జరుగుతుంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్కులో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.
- రెండవ వన్డే.. నవంబర్ 7వ తేదీ శనివారం జరుగుతుంది. వెల్లింగ్ టన్ లోని హెన్రీ స్టేడియంలో జరుగుతుంది.
- మూడవ వన్డే నవంబర్ 10న మంగళవారం జరుగుతుంది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.
- నాలుగో వన్డే నవంబర్ 13 శుక్రవారం మౌంట్ మంగనూయి లోని బే ఓవల్ మైదానంలో జరుగుతుంది
- ఐదవ వన్డే నవంబర్ 15 ఆదివారం నాడు మౌంట్ మంగనూయి ప్రాంతంలోని బె ఓవల్ మైదానంలో జరుగుతుంది.
ఈ మ్యాచ్లు మొత్తం భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి.
ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్.. సోనీ లివ్ లో ఈ మ్యాచ్లు వీక్షించవచ్చు.
భారత జట్టు.. తొలి మూడు వన్డేలకు..
గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ దీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్ దీప్ సింగ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి (తొలి వన్డేలోనే ఆడేది), అకిమ్ నబి.
మిగతా రెండు వన్డేలకు
అయ్యర్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కిషన్ కిషన్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ దీర్, అకిబ్ నబీ, గైక్వాడ్, గుర్నూర్, అర్ష్ దీప్ సింగ్, కుమార్ కుషాగ్ర, మహమ్మద్ సిరాజ్, ఠాకూర్, కులదీప్ యాదవ్.
తొలి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు..
మిచెల్ సాంట్నర్(కెప్టెన్),మైకెల్ బ్రేస్ వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డపీ, మ్యాట్ ఫిషర్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమిషన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లేయిర్ టిక్నర్.
మిగతా రెండు వన్డేలకు
మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైకెల్ బ్రేస్ వెల్, క్రిస్టియాన్ క్లార్క్, జేకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ హీ, నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్, బ్లేయిర్ టిక్నర్, విల్ యంగ్.