Homeక్రీడలుక్రికెట్‌Mohammed Siraj: 200% ఇస్తున్నా.. చోటు లేదు.. మన సిరాజ్ మీద గౌతమ్ గంభీర్ ఇంత...

Mohammed Siraj: 200% ఇస్తున్నా.. చోటు లేదు.. మన సిరాజ్ మీద గౌతమ్ గంభీర్ ఇంత కోపమా..

Mohammed Siraj: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు చోటు లభించలేదు. దీంతో అతడి అభిమానులు మొత్తం ఆశ్చర్యపోయారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు సంబంధించి తన కెరియర్ బెస్ట్ ఇస్తున్నప్పటికీ గౌతమ్ గంభీర్ మనసు కరగడం లేదు. అత్యుత్తమ ప్రతిభ ఉన్న సిరాజ్ విషయంలో అతడు కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడని సిరాజ్ అభిమానులు […]

Mohammed Siraj: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు చోటు లభించలేదు. దీంతో అతడి అభిమానులు మొత్తం ఆశ్చర్యపోయారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు సంబంధించి తన కెరియర్ బెస్ట్ ఇస్తున్నప్పటికీ గౌతమ్ గంభీర్ మనసు కరగడం లేదు. అత్యుత్తమ ప్రతిభ ఉన్న సిరాజ్ విషయంలో అతడు కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడని సిరాజ్ అభిమానులు పేర్కొంటున్నారు. అసలు సిరాజ్ విషయంలో గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరు రకరకాల సందేహాలకు కారణమవుతోంది.

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు తుది జట్టులో చోటు లభించలేదు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించకపోయినప్పటికీ.. తొలి టెస్ట్ లో ప్లేయింగ్ ఎలెవెన్ లో అవకాశం కల్పించలేదు. వెల్డింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో రంగంలోకి దిగింది. బుమ్రా.. ఆకాష్.. కాంబోజ్.. ప్రసిద్ కృష్ణ వంటి వారికి తుది జట్టులో చోటు కల్పించారు. ఆకాష్ దీప్.. కాంబోజ్ వంటి ప్లేయర్లు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. అందువల్లే సిరాజ్ కు చోటు కల్పించలేదని తెలుస్తోంది. ఇటీవల వన్డే సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మోర్ని మోర్కిల్ శిక్షణలో అతడు మరింత రాటు తేలిపోయాడు.

సిరాజ్ కు అవకాశం ఇవ్వకపోవడం. గుర్నూర్ బ్రార్ ను పక్కన పెట్టడం పట్ల కెప్టెన్ గిల్ తన బాధను వ్యక్తం చేశాడు. ఇది కష్టమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. వారం రోజులుగా జట్టుకూర్పు గురించి చర్చించామని.. బోర్డర్లు మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఫామ్ లేదని సిరాజ్ ను పక్కన పెట్టలేదని.. జట్టు కూర్పు ఆధారంగా.. తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇదని గిల్ వ్యాఖ్యానించాడు. అయితే రెండవ టెస్టులో అతడికి ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ పరిశీలిస్తుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సిరాజు ఇటీవలి వన్డే సిరీస్లో అదరగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇటీవలి వన్డేలో దుమ్మురేపాడు. పదునైన బంతులు వేసి న్యూజిలాండ్ బ్యాటర్లను వెనక్కి పంపించాడు. ఒకవేళ అతడిని ఆడించి ఉంటే బుమ్రా మీద ఒత్తిడి తగ్గేది. గతంలో అనేక టూర్లలో సిరాజ్ తన స్థాయిని చూపించాడు. సిరాజ్ కు అవకాశం లభించకపోవడం పట్ల సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ మీద అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper