Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Viral Video: అమరావతి రియల్ మహిష్మతి.. నారా లోకేష్ వీడియో గూస్ బంప్స్ అంతే.....

Amaravati Viral Video: అమరావతి రియల్ మహిష్మతి.. నారా లోకేష్ వీడియో గూస్ బంప్స్ అంతే.. వైరల్ వీడియో

Amaravati Viral Video: రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యం ఊహకు అందకుండా ఉంటుంది. స్వర్గలోకాన్ని మించి ఉంటుంది. చుట్టూ పంట పొలాలు.. విస్తారంగా ప్రవహించే నది.. బంగారు పంటలు పండే భూములు.. స్వచ్ఛమైన మనుషులు.. రాజధాని అంటే అలా ఉండాలి అన్నట్టుగా మాహిష్మతి కనులకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోంది. మాహిష్మతి రీల్ లో గొప్పగా కనిపిస్తే.. రియల్ లైఫ్ లో అమరావతిని అంతకంటే గొప్పగా […]

Amaravati Viral Video: రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యం ఊహకు అందకుండా ఉంటుంది. స్వర్గలోకాన్ని మించి ఉంటుంది. చుట్టూ పంట పొలాలు.. విస్తారంగా ప్రవహించే నది.. బంగారు పంటలు పండే భూములు.. స్వచ్ఛమైన మనుషులు.. రాజధాని అంటే అలా ఉండాలి అన్నట్టుగా మాహిష్మతి కనులకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోంది. మాహిష్మతి రీల్ లో గొప్పగా కనిపిస్తే.. రియల్ లైఫ్ లో అమరావతిని అంతకంటే గొప్పగా రూపొందిస్తున్నారు చంద్రబాబు.

వైసిపి పరిపాలన కాలంలో అమరావతి పడావు పడింది. తుమ్మ చెట్లు మొలిచాయి. రోడ్లు పనికిరాకుండా పోయాయి. బిల్డింగులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీనికి తోడు విష ప్రచారం.. మొత్తంగా అమరావతిని ఐదేళ్లపాటు పక్కన పెట్టారు. పైగా మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చివరికి రాజధాని విషయంలో చంద్రబాబు కృత నిశ్చయం మొత్తానికి సాకారం అవుతోంది. అన్నింటికీ మించి కేంద్రం సహకారం లభించడంతో అమరావతి వేగంగా నిర్మాణం అవుతుంది.

ఇటీవల కొండవీటి వాగుకు సంబంధించిన ఫోటోలను ఏపీ ప్రభుత్వం బయట పెట్టడంతో అమరావతి స్థాయి ఏమిటో జనాలకు అర్థమైంది. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక సంచలనమైన వీడియోను ఏపీ మంత్రి నారా లోకేష్ బయటపెట్టారు. అమరావతి ప్రజల కలల రాజధాని అంటూ ఆయన ఇచ్చిన ఎలివేషన్ వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉంది. రాజధాని పునర్ నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని లోకేష్ బయట పెట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం గా నిలుస్తుంది. వంద రోజులు గడుస్తున్న కొద్ది అమరావతి సరికొత్తగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పనుల వేగం జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని నారా లోకేష్ వీడియో రూపంలో బయటపెట్టారు.

ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో దృఢ సంకల్పం ఉంది. అంకిత భావంతో పనిచేసే బృందం ఉంది. అందువల్లే ప్రతి 100 రోజులకు ఒకసారి అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. నారా లోకేష్ విడుదల చేసిన వీడియోలో గతంలో ఆగిపోయిన రహదారుల నిర్మాణం. ఐకానిక్ భవనాల పునాదులు.. సచివాలయ టవర్లు.. నివాస సముదాయాల నిర్మాణ పనులు.. ప్రతి వంద రోజులకు ఒకసారి ఎంత వేగంగా నిర్మాణం అవుతున్నాయో అర్థం అవుతుంది. పనులలో వందలాది యంత్రాలు.. వేలాది మంది కార్మికులతో అమరావతి మాహిష్మతిని తలపిస్తోంది. ఋషులు నిర్మించిన యజ్ఞశాల మాదిరిగా కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రజా రాజధాని తన అసలు రూపానికి వచ్చిందని.. వాస్తవ రూపానికి అత్యంత దగ్గరలో ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం వేగవంతమైందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అంతేకాదు #AmravatiUnstoppable అనే యాష్ ట్యాగ్ తో లోకేష్ విడుదల చేసిన వీడియో రాష్ట్ర ప్రజల్లో హర్షాన్ని నింపుతోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. తాము చేస్తున్న ప్రగతిని ప్రజల ముందు ఉంచుతున్న ప్రభుత్వ తీరు మీద ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper