Homeక్రీడలుక్రికెట్‌Arshdeep Singh: అర్ష్ దీప్ సింగ్.. నక్క తోక తొక్కాడు.. ఎందుకో తెలుసా..

Arshdeep Singh: అర్ష్ దీప్ సింగ్.. నక్క తోక తొక్కాడు.. ఎందుకో తెలుసా..

Arshdeep Singh: ఆమె ముఖారవిందాన్ని చూస్తే చందమామ కూడా చిన్న పోతుంది. ఆమె సొగసును చూస్తే పూ బాలలు తలలు తిప్పుకుంటాయి. అందానికి ఆధార్ కార్డు లాంటి ఆమె.. టీమిండియా క్రికెటర్ అర్ష్ దీప్ సింగ్ కు క్లీన్ బౌల్డ్ అయింది. మనోడి ప్రేమకు తలవంచింది.. అతడి కేరింగ్ కు ఫిదా అయింది. ఇప్పటికే అతనితో చేయి పట్టుకొని చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతోంది. మనోడి మనసును గెలిచి.. మనోడి హృదయంలో స్థానం సంపాదించిన ఆ యువతి […]

Arshdeep Singh: ఆమె ముఖారవిందాన్ని చూస్తే చందమామ కూడా చిన్న పోతుంది. ఆమె సొగసును చూస్తే పూ బాలలు తలలు తిప్పుకుంటాయి. అందానికి ఆధార్ కార్డు లాంటి ఆమె.. టీమిండియా క్రికెటర్ అర్ష్ దీప్ సింగ్ కు క్లీన్ బౌల్డ్ అయింది. మనోడి ప్రేమకు తలవంచింది.. అతడి కేరింగ్ కు ఫిదా అయింది. ఇప్పటికే అతనితో చేయి పట్టుకొని చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతోంది. మనోడి మనసును గెలిచి.. మనోడి హృదయంలో స్థానం సంపాదించిన ఆ యువతి పేరు సమ్రీన్ కౌర్.

నిలువెత్తు అందం పోత పోస్తే ఎలా ఉంటుందో.. సమ్రీన్ అలా ఉంటుంది.. ఈమెతో అర్ష్ దీప్ సింగ్ కు పరిచయం చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట్లో ఈమె కామన్ ఫ్రెండ్ ద్వారా అర్ష్ దీప్ సింగ్ కు పరిచయం. ఆ తర్వాత ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం మాటలు మొదలుపెట్టారు. స్వల్ప కాలంలోనే తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఓకే గూటి పక్షుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కౌర్ తో అర్ష్ దీప్ సింగ్ సంబంధం కొనసాగిస్తున్నాడని స్పోర్ట్స్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కానీ దానిని అధికారికంగా అర్ష్ దీప్ సింగ్ ఎన్నడూ ప్రకటించలేదు. అయితే ఇటీవల విదేశీయాత్రకు అర్ష్ దీప్ సింగ్ వెళ్లాడు. అక్కడ కౌర్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోలకు చూస్తుండగానే మిలియన్లలో లైక్స్ రావడం విశేషం. ఈ జంటను చాలామంది దీవిస్తున్నారు. భావిజీవితం బాగుండాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. జంట చాలా బాగుందని వారు ఈసందర్భంగా కితాబిస్తున్నారు.

కౌర్ సాధారణ అమ్మాయి కాదు. ఈమె సినీ రంగానికి చెందింది. నటిస్తుంది. మోడలింగ్ కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కూడా కౌర్ 1999 సెప్టెంబర్ 7న జమ్మూ కాశ్మీర్లో జన్మించింది. ఈమె పూణేలో బీకాం చేసింది. 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో చివరి వరకు వెళ్ళింది.. అయితే సినిమాల్లోకి రాకపోతే ఈమె మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. 83.. సర్దార్ జీ 2 అనే చిత్రాలలో నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో గట్టిగానే ఫాలోయింగ్ ఉంది. ఈమెను ఇన్స్టాగ్రామ్ లో 4.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Arshdeep Singh (@_arshdeep.singh__)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper