Homeక్రీడలుIndia vs Sri Lanka : మైదానంలో గొడవ.. దాదాపు కొట్టుకునేంతగా శ్రీలంక, ఇండియా ప్లేయర్ల...

India vs Sri Lanka : మైదానంలో గొడవ.. దాదాపు కొట్టుకునేంతగా శ్రీలంక, ఇండియా ప్లేయర్ల రచ్చ

India vs Sri Lanka : టి20 క్రికెట్లో ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. కొంతమంది ఆటగాళ్లు కావాలని ప్రత్యర్థి ప్లేయర్లను గెలుకుతుంటారు. మైదానంలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. కానీ టెస్ట్ క్రికెట్లో అలా ఉండదు. ఎప్పుడో అరుదైన సందర్భాలలో మాత్రమే ప్లేయర్లు తమ లయ కోల్పోతారు. ఆదివారం నాడు టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. టీమిండియా ఓపెనర్ జైస్వాల్ రెండో టెస్ట్ […]

India vs Sri Lanka : టి20 క్రికెట్లో ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. కొంతమంది ఆటగాళ్లు కావాలని ప్రత్యర్థి ప్లేయర్లను గెలుకుతుంటారు. మైదానంలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. కానీ టెస్ట్ క్రికెట్లో అలా ఉండదు. ఎప్పుడో అరుదైన సందర్భాలలో మాత్రమే ప్లేయర్లు తమ లయ కోల్పోతారు. ఆదివారం నాడు టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది.

టీమిండియా ఓపెనర్ జైస్వాల్ రెండో టెస్ట్ మ్యాచ్లో 45 పరుగులు చేశాడు. అతడు ఉన్నంత సేపు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ దశలో అతడు హసిత బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జైస్వాల్ 53 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేశాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత.. శ్రీలంక బౌలర్ హసిత హద్దులు దాటాడు. మైదానంలో విచిత్రంగా ప్రవర్తించాడు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకే అతని మీద విపరీతమైన కోపం వచ్చింది. అసలు అలా అతడు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అలా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి అని అక్కడ ఉన్న వ్యాఖ్యాతలు కూడా పేర్కొన్నారు అంటే.. అతని ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అవుట్ అయిన తర్వాత జైస్వాల్ తన దారిన తాను వెళ్లిపోతున్నాడు. కానీ శ్రీలంక బౌలర్ మాత్రం గట్టిగా అరిచాడు. పిచ్చి పట్టిన వాడిగా ప్రవర్తించాడు. అంతేకాదు.. జైస్వాల్ ను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేశాడు. దీంతో జై దూసుకు వచ్చాడు.

హసిత పిచ్చి పట్టిన కోతి లాగా ప్రవర్తించడంతో జైస్వాల్ కు విపరీతమైన కోపం వచ్చింది. దీంతో అతడు తట్టుకోలేక హసిత మీద కు దూసుకు వెళ్ళాడు. దీంతో హసిత కూడా అదే విధంగా స్పందించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఇద్దరు ప్లేయర్లు కొట్టుకుంటారేమో అని అనిపించింది. ఆ తర్వాత అంపైర్లు ప్రవేశించారు. శ్రీలంక ప్లేయర్లు కూడా మధ్యలో వచ్చారు. ఇద్దరిని శాంత పరిచారు. ఆ తర్వాత జైస్వాల్ తన దారిన తాను వెళ్లిపోయాడు. హసిత సైలెంట్ అయిపోయాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా మైదానంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఇద్దరు ప్లేయర్లు కొట్టుకుంటారేమోననన్న ఆందోళన నెలకొంది. చివరికి అంపైర్లు.. తోటి ప్లేయర్లు సర్ది చెప్పడంతో వారిద్దరు సైలెంట్ అయిపోయారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper