Homeఅంతర్జాతీయంCanada vs United States : తగ్గేదే లే.. అమెరికాకు కెనడా షాక్‌.. సరికొత్త ట్రేడ్‌...

Canada vs United States : తగ్గేదే లే.. అమెరికాకు కెనడా షాక్‌.. సరికొత్త ట్రేడ్‌ వార్‌!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక పొరుగు దేశం కెనడాలో కయ్యం పెట్టుకుంటున్నారు. అక్రమ వలసలు ఆపకపోతే కెనడాని అమెరికా 51వ రాష్ట్రంగా ప్రకటిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై కెనడా మండిపడింది. ఇదే సమయంలో కెనడాలోని కొన్ని ప్రాంతాలు అమెరికాలో కలపాలని నిరసనలు తెలిపాయి. దీని వెనుక అమెరికా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండె కెనడాలో ట్రంప్‌ వాణిజ్య చిచ్చు పెట్టారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించలేదనే కారణంతో ట్రంప […]

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక పొరుగు దేశం కెనడాలో కయ్యం పెట్టుకుంటున్నారు. అక్రమ వలసలు ఆపకపోతే కెనడాని అమెరికా 51వ రాష్ట్రంగా ప్రకటిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై కెనడా మండిపడింది. ఇదే సమయంలో కెనడాలోని కొన్ని ప్రాంతాలు అమెరికాలో కలపాలని నిరసనలు తెలిపాయి. దీని వెనుక అమెరికా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండె కెనడాలో ట్రంప్‌ వాణిజ్య చిచ్చు పెట్టారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించలేదనే కారణంతో ట్రంప తాజాగా ఆ దేశంపై 50 శాతం సుంకాలు విధించారు. అయితే అమెరికా టారిఫ్‌లకు కెనడా ఎక్కడా జంకలేదు. తగ్గేదే లే అన్నట్లుగా అగ్రరాజ్యం దిగుమతులపై కెనడా అంతే స్థాయిలో టారిఫ్‌లు విధించి షాక్‌ ఇచ్చింది. ప్రధాని మార్క్‌ కార్నీ నాయకత్వంలో ఒట్టావా ప్రభుత్వం అమెరికాపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ఉక్కు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలపై సెప్టెంబర్‌ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

వాణిజ్య చర్చలు విఫలం..
గత కొన్ని వారాలుగా అమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం తీవ్రమైన చర్చలు జరిగాయి. ట్రంప్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. అవి అన్యాయమైనవిగా, ఆర్థికంగా ప్రయోజనం లేనివిగా కెనడా భావించింది. ప్రత్యేకంగా కెనడా ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై పరిమితులు, సార్వభౌమత్వం సంబంధిత అంశాలు సమస్యగా మారాయి. ‘వారు ఎక్కువ అడిగారు, తక్కువ ఇచ్చారు. మేము అంగీకరించం’ అని కార్నీ వాణిజ్య ఒప్పందంపై స్పష్టం చేశారు. ఫలితంగా చర్చలు నిలిచిపోయాయి. అమెరికా టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి.

కెనడా ప్రతీకారం..
ట్రంప్‌ విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా ‘డాలర్‌ టు డాలర్‌’ సూత్రంపై సమాధానం ఇవ్వనున్నది. అమెరికా విధించిన సుంకాలకు సమానంగా తన సుంకాలు ఉంటాయని ప్రకటించింది. ఉక్కు, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, పల్ప్‌ అండ్‌ పేపర్, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై ఈ టారిఫ్‌ వర్తిస్తుదని ప్రకటించింది. కెనడా ప్రధాని ‘మేము దాడికి గురయ్యాము. యుద్ధంలో ఉన్నప్పుడు స్పందించాల్సిందే.’ అయితే ఇది అయిష్టంగానే చేస్తున్నామని, కెనడా కుటుంబాలు, వ్యాపారాలపై ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా అంగీకరించారు.

రెండు దేశాలపై ప్రభావం..
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు సుమారు 20 బిలియన్‌ డాలర్ల విలువైన కెనడా ఎగుమతులపై పడ్డాయి. ఇవి మొత్తం ఎగుమతుల్లో 5 శాతం మేర ఉన్నాయి. హాకీ పరికరాలు, సిమెంట్, వైన్, దుస్తులు వంటి వస్తువులు ప్రభావితమయ్యాయి. కెనడా ప్రతీకారం కూడా అమెరికా ఉత్పత్తుల ధరలను పెంచుతుంది. రెండు దేశాల వినియోగదారులు, రైతులు, పరిశ్రమలు ఇబ్బంది పడవచ్చు. ఈ వాణిజ్య ఘర్షణ కేవలం ఆర్థికంగానే కాకుండా రాజకీయ, వ్యూహాత్మక సంకేతం. కెనడా తన సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అమెరికాపై ఆధారపడకుండా ఇతర మార్కెట్ల వైపు చూస్తోంది.

మొత్తంగా కెనడా అమెరికాకు భయపడేది లేదని స్పష్టం చేసింది. పెద్ద భాగస్వామి ఒత్తిడికి లొంగకుండా తన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సంకల్పం కనిపిస్తోంది. ఈ వాణిజ్య యుద్ధం ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో రాబోయే వారాల్లో స్పష్టమవుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper