CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి మన తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఆయన సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడాలు వంటివి ఆయన క్రేజ్ కి కారణం ఒకటి అయితే, సీఎం అవ్వడం కూడా మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేపట్టే కార్యక్రమాలు చూసి మన రాష్ట్రం లో కూడా ఇలాంటి లీడర్ ఉంటే బాగున్ను అని నెటిజెన్స్ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అధికారం లో లేనప్పుడు జనాల్లో ఉండడం కాదు , అధికారం వచ్చిన తర్వాత కూడా జనాల్లో ఉండడం విజయ్ స్పెషాలిటీ అని , అందుకే ఆయన్ని తెలుగు ఆడియన్స్ కూడా అంతలా ఆదరిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే నేడు ఆయన తమిళనాడు లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ప్రారంభించాడు. గత ప్రభుత్వం లో మాజీ సీఎం స్టాలిన్ ఈ పధకాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి విరామం లేకుండా సాగుతున్న ఈ పథకం, విజయ్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఆగిపోయిందని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయితే నేడు తనని విమర్శిస్తున్న ప్రత్యర్థుల నోర్లు మూసుకునేలా చేసాడు విజయ్. మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఒక బస్సులోకి ఎక్కిన విజయ్, కండక్టర్ గా మారి మహిళలకు టికెట్స్ పంపిణీ చేశాడు. తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్నీ మర్చిపోయి , ఇసుమంత గర్వం కూడా లేకుండా విజయ్ చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
నిన్న మొన్నటి వరకు విజయ్ ని ద్వేషించినా వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన్ని పొగుడుతున్నారు. అయితే ఇదంతా పీఆర్ టాక్టిక్స్ అని, పబ్లిసిటీ ఎక్కువ , పని తక్కువ అంటూ సోషల్ మీడియా లో ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సాగాల్సిన పధకాలను ఆపి , ఇన్ని రోజుల సమయం తర్వాత ప్రారంభించాడని, ఉన్న పధకాలను అమలు చేయడానికే ఇంత సమయం తీసుకుంటే, ఇక తాను ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తాడు అంటూ సోషల్ మీడియా లో విమర్శలు వినిపిస్తున్నాయి.