Homeక్రీడలుక్రికెట్‌Devdutt Padikkal : శ్రీలంక స్పిన్ బౌలింగ్ ను పోయించాడు.. టీమిండియాకు మరో ద్రావిడ్ దొరికేశాడు..

Devdutt Padikkal : శ్రీలంక స్పిన్ బౌలింగ్ ను పోయించాడు.. టీమిండియాకు మరో ద్రావిడ్ దొరికేశాడు..

Devdutt Padikkal : ఆహా.. ఆ కవర్ డ్రైవ్ లు.. అద్భుతం. రిస్ట్ హండెడ్ షాట్లు అనితరసాధ్యం.. చూడ చక్కని సింగిల్స్.. మెరుపు వేగంతో తీసిన డబుల్స్.. ఇలా అతడి బ్యాటింగ్ సూపర్ గా సాగింది. అతడు ఆడుతుంటే ద్రావిడ్ ఆటను చూసినట్టు అనిపించింది. శ్రీలంకలో స్పిన్ బౌలింగ్ బాగుంటుంది.. ఇప్పటి స్పిన్ బౌలర్లు వేస్తున్న బౌలింగ్ అద్భుతంగా ఉంటుందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ వాటిని తప్పని నిరూపించాడు టీమిండియా ఆటగాడు. శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి […]

Devdutt Padikkal : ఆహా.. ఆ కవర్ డ్రైవ్ లు.. అద్భుతం. రిస్ట్ హండెడ్ షాట్లు అనితరసాధ్యం.. చూడ చక్కని సింగిల్స్.. మెరుపు వేగంతో తీసిన డబుల్స్.. ఇలా అతడి బ్యాటింగ్ సూపర్ గా సాగింది. అతడు ఆడుతుంటే ద్రావిడ్ ఆటను చూసినట్టు అనిపించింది. శ్రీలంకలో స్పిన్ బౌలింగ్ బాగుంటుంది.. ఇప్పటి స్పిన్ బౌలర్లు వేస్తున్న బౌలింగ్ అద్భుతంగా ఉంటుందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ వాటిని తప్పని నిరూపించాడు టీమిండియా ఆటగాడు.

శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమ్ ఇండియా లంక బౌలింగ్ మొత్తాన్ని నాశనం చేసింది. యశస్వి జైస్వాల్ 32, గిల్ 16 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వెళ్లినప్పటికీ.. దేవదత్ పడికల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన అతడు.. 178 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తొలి వికెట్ 47 పరుగుల వద్ద టీమ్ ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత రెండో వికెట్ కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. దేవదత్ కేఎల్ రాహుల్ తో కలిసి ఈ అద్భుతమైన ఘనతను నిర్మించాడు. ఒకవేళ రాహుల్ గనుక రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వెళ్లకపోతే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది అయితే గిల్ అదరగొడతాడు అనుకుంటే.. జై సూర్య బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 236 పరుగుల వద్ద రెండవ వికెట్ కోల్పోయింది.

ఈ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే భారత బ్యాటర్లు దానిని తప్పు అని నిరూపించారు. జైస్వాల్ ఉన్నంతలో వేగంగా ఆడాడు. కేఎల్ రాహుల్ తన మాస్టర్ క్లాస్ చూపించాడు. ఇక దేవదత్ తనలో ఉన్న అద్భుతమైన టెస్ట్ క్రికెటర్ ను పరిచయం చేశాడు. ద్రావిడ్ లాంటి ఆట తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.

తొలి టెస్ట్ లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు దేవదత్. టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ కొంతకాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా టీమిండియా పరిస్థితి గొప్పగా లేదు. ఇలాంటి స్థితిలో జట్టుకు అద్భుతమైన విజయం కావాలి. అది సొంతం కావాలి అంటే ప్లేయర్లు మెరుగైన ఆట తీరుకున్న సాగించాలి. ఇటీవల కాలంలో టీమిండియాలో ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ లో ఆటగాళ్లు అంత గొప్పగా ఆడటం లేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దేవదత్ తనను తాను నిరూపించుకున్నాడు. ఒకప్పటి ద్రావిడ్ లాగా ఆడుతూ అదరగొట్టాడు. రెండవ రోజు కూడా అతడు ఇదే జోరు చూపిస్తే.. టీమ్ ఇండియాకు తిరిగి ఉండదు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల కోల్పోయి 288 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఒక వికెట్ సాధించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper