Homeక్రీడలుక్రికెట్‌IND vs SL: మూడు రోజులపాటు భారీ వర్షాలు.. మ్యాచ్ రద్దు అయితే టీమిండియా పరిస్థితి...

IND vs SL: మూడు రోజులపాటు భారీ వర్షాలు.. మ్యాచ్ రద్దు అయితే టీమిండియా పరిస్థితి ఏంటి..

IND vs SL : గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ కు వర్షం ముప్పు ఇంకా తగ్గిపోలేదు. ఆదివారం చాలాసేపు ఆటకు అంతరాయం కలిగించిన వర్షం.. సోమ, మంగళ, బుధవారాల్లోనూ ఆటంకం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం చిరుజల్లులు కురిసిన నేపథ్యంలో.. సోమవారం నుంచి బుధవారం వరకు అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండో రోజు టీమిండియా భారీ స్కోర్ చేసింది. దేవదత్ 167 పరుగులు చేశాడు. వర్షం […]

IND vs SL : గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ కు వర్షం ముప్పు ఇంకా తగ్గిపోలేదు. ఆదివారం చాలాసేపు ఆటకు అంతరాయం కలిగించిన వర్షం.. సోమ, మంగళ, బుధవారాల్లోనూ ఆటంకం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం చిరుజల్లులు కురిసిన నేపథ్యంలో.. సోమవారం నుంచి బుధవారం వరకు అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

రెండో రోజు టీమిండియా భారీ స్కోర్ చేసింది. దేవదత్ 167 పరుగులు చేశాడు. వర్షం కురవడంతో ఆదివారం నాడు కేవలం 43 ఓవర్లపాటే బౌలింగ్ సాగింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. టీమిండియా కు పెద్ద దెబ్బ తగిలి ఆకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో టీమిండియా కు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే డబ్ల్యూటీసి ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం టీమిండియా 5వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాపై గెలిచిన బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది

ఒకవేళ టీం ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా వచ్చే ఎనిమిది టెస్టులలో ఏడు కచ్చితంగా గెలవాలి. అప్పుడే టీమిండియాకు ఫైనల్ వెళ్లడానికి మార్గం ఏర్పడుతుంది. గాలే మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలమైనప్పటికీ.. టీం ఇండియా బ్యాటర్లు సమర్థవంతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దేవదత్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు సెంచరీ చేసిన అతడు.. రెండవ రోజు కూడా అదే జోరు చూపించాడు. డబుల్ సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో 167 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక నిలబడి ఉంటే టీమిండియా స్కోర్ మరింత మెరుగ్గా ఉండేది..

కేవలం 43 ఓవర్ల పాటే మ్యాచ్ సాగడంతో టీమిండియా బ్యాటర్లు వేగంగా బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఒకవేళ పూర్తిస్థాయిలో గనుక ఓవర్లు సాగి ఉంటే టీమిండియా స్కోర్ దాదాపు 500 కు మించి ఉండేది. అప్పుడు కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉండేవాడు. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే శ్రీలంకకు పెద్దగా నష్టం ఉండదు. కానీ టీమిండియా కు మాత్రమే ఇబ్బంది. అందువల్లే ఈ మ్యాచ్ వర్షం వల్ల రాదు కాకూడదని ఇండియన్ అభిమానులు కోరుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper