1.3 KM Train : మన దేశంలో రైలు మార్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రయాణికులతో పాటు పెద్ద ఎత్తున సరుకులను రవాణా చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇటీవల అత్యంత భారీ పొడవైన రైలును ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు సింగిల్ స్టాక్ కంటైనర్ రైలు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు 1.3 కిలోమీటర్ల పొడవున్న డబుల్ స్టాక్ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రైలుకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని విశేషాల్లోకి వెళ్తే..
మంత్రి తెలిపిన ప్రకారం.. ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ కోర్టు నుంచి గుజరాత్లోని వడోదరా వరకు భారీ పొడవైన రైలు ప్రయాణించింది. దాదాపు 42 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసిన ఈ రైలు డబుల్ స్టాక్ కంటైనర్లతో వెళ్ళింది. ఇందులో మొత్తం 360 కంటైనర్లు ఉన్నాయి. వీటి బరువు సుమారు 3922 టన్నులు. ఒక్కో కంటైనర్ సుమారు 20 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో కూడా రవాణా చేయవచ్చు అని రైల్వే శాఖ నిరూపించింది.
అయితే ఇంత పెద్ద రైలును నడపడానికి తగిన సామర్థ్యం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ప్రత్యేక రైల్వే మౌలిక సదుపాయాలను కల్పించారు. తగినంత ట్రక్ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 1.3 కిలోమీటర్ల పొడవును ఎంచుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఒక కంటైనర్ పై మరో కంటైనర్ ను పేర్చి తీసుకెళ్లడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
ఇలాంటి రైళ్లతో ఎగుమతులు, దిగుమతులకు అనేక ప్రయోజనాలు కలగన ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పోర్టుల నుంచి నగరాలకు సరుకులు తీసుకెళ్లడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. ఇలాంటి రైలతో రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించే సరుకులకు దీనిని చాలా వరకు ఉపయోగించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రైల్వే శాఖ ఈ కొత్త రైలుతో రికార్డు సృష్టించింది. దేశంలో లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కొత్త మార్పును తీసుకొచ్చింది. అందులోనూ ఇంత పొడవైన రైల్వే తో మరిన్ని ప్రయోజనాలు కలిగి అవకాశం ఉందని అంటున్నారు.
https://twitter.com/AshwiniVaishnaw/status/2091143261775917352