POCO Redmi MI: ఫ్లిప్కార్ట్ సంస్థ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా అనేక రకాల బ్రాండ్ల ఫోన్లో మీద తగ్గింపు ప్రకటించింది. మార్కెట్లో యంగ్ జనరేషన్ కోరుకునే ఫోన్ల మీద ఫ్లిప్కార్ట్ సంస్థ బ్రహ్మాండమైన డిస్కౌంట్లు.. తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏఏ బ్రాండ్ల మీద తగ్గింపులు ఉన్నాయి.. వాటి గతం ధర ఎంత ఉంది.. ఇప్పుడు ఎంత ఉంది.. వాటి స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు ఈ కథనంలో తెలుసుకుందాం
POCO M8 power 6/128 GB
ఈ ఫోన్ ధర గతంలో 24,999 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం 20, 999 రూపాయలుగా ఉంది. దాదాపు నాలుగు వేల వరకు తగ్గింపు ప్రకటించింది.
POCO M8 power 8/128 GB
ఈ ఫోన్ ధర గతంలో 27,999 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 23,999 రూపాయలుగా ఉంది. దాదాపు 4000 వరకు తగ్గింపు ప్రకటించారు.
POCO X8 8/128 GB
ఈ ఫోన్ ధర గతంలో 32,999 రూపాయలు ఉండేది. ఇప్పుడు 27,999 రూపాయలకు లభిస్తుంది. ఈ బ్రాండ్ మీద ఐదు వేల రూపాయల తగ్గింపు ప్రకటించింది.
POCO X8 8/256 GB
ఈ ఫోన్ ధర గతంలో 35, 999 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దీని ధర 30,999 గా ఉంది దాదాపు 5వేల వరకు ఈ ఫోన్ మీద తగ్గింపు ప్రకటించారు. ఇవే కాకుండా పోకోలోని మిగతా బ్రాండ్ల మీద కూడా దాదాపు 5 నుంచి 6000 వరకు తగ్గింపు ప్రకటించారు.
రెడ్మీ ఫోన్ల విషయంలో కూడా బ్రహ్మాండమైన డీల్ ఉంది. రెడ్మీ నోట్ 15 ఎస్ ఈ 5 జీ ఫోన్ ధర 25,999 రూపాయలుగా ఉంటే.. ప్రస్తుత ధర 22,999 రూపాయలుగా ఉంది. 3000 రూపాయలు తగ్గింపు ప్రకటించింది.
బ్యాంకు ఆఫర్లు ఎలా పనిచేస్తాయి
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కొన్ని ప్రచురితమైన ధరలు బ్యాంక్/ కార్డు డిస్కౌంట్ కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైస్ లాగా ఉంటాయి. మరో నివేదిక ప్రకారం ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి చెక్ అవుట్ సమయంలో కనిపించే ఫైనల్ ప్రైస్.. కేవలం ఫోన్ సేల్ ప్రైస్ కంటే తక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు పోకో ఎక్స్ 8 సాధారణంగా 29,999 ధర ఉంటుంది. సేల్ లో దీని ధర 24,999 గా ఉంది. దీనికి వర్తించే కార్డు ఆఫర్ కంటే ఎఫెక్టివ్ కాస్ట్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఎం 8 పవర్ 20,999, ఎక్స్ 8 24,999, ఎక్స్ 8 పవర్ 29,999, ఎక్స్ 8 ప్రో 33,999 ధరలో లభిస్తాయి.
రెడ్ మీ టర్బో 5 మోడల్ లాంచ్ సమయంలో 8 జీబీ+ 256 జీబీ 37,999, 12 జీబీ+ 256 జీబీ 40,999 ధర ఉండేది. 8 జీబీ+ 256 జీబీ ధర 41,999 రూపాయలుగా ఉంది. ధర పెరుగుదల మెమొరీ/ కాంపోనెంట్ ఖర్చులపరంగా ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.