October Smartphone Launches: అక్టోబర్ నెలలో ఫోన్ల జాతర మొదలు కాబోతోంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలుపెట్టింది. అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్ మొదలు పెట్టబోతోంది. మిగతా సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటించాయి. కంపెనీలు కూడా ప్రత్యేకంగా ఆఫర్లు ఇస్తున్నాయి. ఇంతకీ ఏ ఏ బ్రాండ్లు అక్టోబర్ నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి.. వీటి ఫీచర్లను ఒకసారి తెలుసుకుందాం..
అక్టోబర్ నెలలో oppo, vivo, xiaomi, Samsung క్వాలిటీ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.. ముఖ్యంగా పండుగ సీజన్ కొనుగోళ్లకు ముందు ఈ ఫోన్లు రావడం వల్ల పాత మోడల్ ధరలు, డిస్కౌంట్ లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్లో అధికారికంగా ప్రకటించని మోడల్స్ విషయంలో చివరి వరకు సమాచారం మారే అవకాశం ఉంది.. oppo find X10 అక్టోబర్ 21న, Vivo X fold 6 అక్టోబర్ 6న, xiaomi 18 Pro వెనుక డిస్ ప్లే వాటి ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
అక్టోబర్ ఐదున ఒప్పో f35 సిరీస్
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఒప్పో ఎఫ్35 సిరీస్ ఫోన్ గురించి. ఈ ఫోన్ అక్టోబర్ ఐదు న భారత మార్కెట్లో విడుదల కాబోతోంది. ఇందులో ఈ ఎఫ్ 35 5జి, ఎఫ్ 35 ప్రో 5g మోడల్స్ అందుబాటులోకి వస్తాయి.ఈ సిరీస్లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా, వైట్ నాచురల్ సెల్ఫీ కెమెరా, హండ్రెడ్ డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ నాచురల్ టోన్ 2.0 వంటి ఫీచర్లను ఒప్పో కంపెనీ అందుబాటులో తీసుకొచ్చింది. ప్రో మోడల్ ముందు, వెనుక కెమెరాలలో 4k వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
అక్టోబర్ 6న వివో నుంచి
అక్టోబర్ 6న వివో నుంచి ఒకేసారి పాలు ఆసక్తికరమైన ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో వివో v80, వివో ఎస్2 ఎఫ్ఈ అత్యంత ముఖ్యమైనవి. వివో వీ80 ఫోన్ ను అక్టోబర్ ఆరవ తేదీన మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
వివో v8 లో ఈసారి బ్యాటరీ కి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అధికారిక సమాచారం ప్రకారం ఇందులో 7,200 ఎంఎహెచ్ టిపికల్ కెపాసిటీ బ్యాటరీ ఉంది. దీనికి 90 W ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K OLED Display, 144 Hz refresh rate వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా వివో ఎస్ 2 ఎఫ్ఈ, వివో ఎక్స్ ఫోల్డ్ 6 వంటి మోడల్ స్కూల్ అందుబాటులోకి రాబోతున్నాయి.
Xiaomi 18 Pro
ఈ ఫోన్ ఈ నెలలో విడుదలవుతోంది. అందుబాటులో ఉన్న లీక్ ప్రకారం.. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ ప్రాసెసర్, 6,700 ఎంఎహెచ్ బ్యాటరీ, 100 W చార్జింగ్ వంటి హై అండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ సిరీస్ లోని ప్రో మాక్స్ గురించి డ్యూయల్ డిస్ప్లే గురించి కూడా కొన్ని వివరాలు బయటికి లీక్ అయ్యాయి. అంటే వెనుక భాగంలో కూడా ప్రత్యేక డిస్ప్లే ఉండే అవకాశం ఉంటుంది.
Samsung galaxy M18
ప్రీమియం ఫోన్లు మాత్రమే కాకుండా.. బడ్జెట్ ఫోన్లను కూడా సాంసంగ్ వదిలిపెట్టడం లేదు. గెలాక్సీ M18 5G ప్రస్తుతం రూమర్ద్ మోడల్ లాగా లిఫ్ట్ అయింది. దీని ధర 20 వేల లోపు ఉంది. ఇందులో 5,500 ఎం ఏ హెచ్ బ్యాటరీ, 25 W చార్జింగ్, 6.74 అంగుళాల 90 Hz Display 50 MP+ 8MP+ 2MP కెమెరా సెటప్ ఉంది.
కంపెనీలు ఎలాంటి పంథా అనుసరిస్తున్నాయంటే..
ఈ నెలలో వస్తున్న ఫోన్లను పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పుడు కేవలం ఎక్కువగా మెగా ఫిక్స్ లేదా ఫాస్ట్ ప్రాసెసర్ తో అగడం లేదు.
- ఒప్పో కంపెనీలో సెల్ఫీ, వీడియో, కెమెరా, భారీ బ్యాటరీ ఉంది
- వివో కంపెనీలో జెడ్ఐఎస్ఎస్ కెమెరాలు, భారీ బ్యాటరీలు, ఫోల్డబుల్ టెక్నాలజీ ఉంది.
- Xiaomi కంపెనీ ఫోన్లో ఫ్లాగ్ షిప్ పనితీరు.. డ్యూయల్ డిస్ప్లే కాన్సెప్ట్ ఉన్నాయి.
- సాంసంగ్ కంపెనీ ఫోన్లలో బడ్జెట్ 5 జీ సెగ్మెంట్ ఫీచర్లు ఉన్నాయి.