Homeబిజినెస్Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ...

Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం

Honda Elevate Facelift :  మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచేందుకు హోండా తన ప్రముఖ ఎలివేట్‌ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను సిద్ధం చేసింది. కొత్త Honda Elevate Faceliftకు సంబంధించి కంపెనీ అధికారిక టీజర్‌ను విడుదల చేయడంతో పాటు ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత హోండా డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్‌ మొత్తంతో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. కొత్త ఎలివేట్‌ అధికారికంగా అక్టోబర్ 6న ఆవిష్కృతం కానుంది. అదే రోజున ధరలను […]

Honda Elevate Facelift :  మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచేందుకు హోండా తన ప్రముఖ ఎలివేట్‌ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను సిద్ధం చేసింది. కొత్త Honda Elevate Faceliftకు సంబంధించి కంపెనీ అధికారిక టీజర్‌ను విడుదల చేయడంతో పాటు ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత హోండా డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్‌ మొత్తంతో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. కొత్త ఎలివేట్‌ అధికారికంగా అక్టోబర్ 6న ఆవిష్కృతం కానుంది. అదే రోజున ధరలను కూడా ప్రకటించనున్నట్లు హోండా వెల్లడించింది.

కొత్త లుక్‌లో ఎలివేట్‌

టీజర్‌లో కనిపించిన వివరాల ప్రకారం ఫేస్‌లిఫ్ట్‌ ఎలివేట్‌కు ముందు భాగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త డిజైన్‌ గ్రిల్‌, పై భాగంలో సెగ్మెంటెడ్‌ ఎల్‌ఈడీ లైట్‌ బార్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు గ్రిల్‌పై ఉన్న హోండా లోగోను బానెట్‌ అంచుకు మార్చారు. వెనుక భాగంలో కనెక్టెడ్‌ ట్విన్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ను అందించారు. కొత్త బంపర్లు, కొత్త డిజైన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లలోనూ అప్‌గ్రేడ్‌

ఇంటీరియర్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. రీడిజైన్‌ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో పాటు యాంబియంట్‌ లైటింగ్‌ను జోడించినట్లు టీజర్‌ సూచిస్తోంది. సెగ్మెంట్‌లోని ప్రత్యర్థి మోడళ్లకు పోటీగా పనోరమిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌-జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, రెయిన్‌-సెన్సింగ్‌ వైపర్లు వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది.

ప్రస్తుత ఎలివేట్‌లో ఇప్పటికే లేన్‌ వాచ్‌ కెమెరా, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, ADAS సేఫ్టీ ఫీచర్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిని ఫేస్‌లిఫ్ట్‌లోనూ కొనసాగించనున్నారు.

ఇంజిన్‌లో మార్పులు లేవు

మెకానికల్‌గా మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత 1.5-లీటర్‌, 4-సిలిండర్‌ i-VTEC పెట్రోల్‌ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ఈ ఇంజిన్‌ 119 బీహెచ్‌పీ పవర్‌, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్‌ మాన్యువల్‌, CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు కొనసాగుతాయి.

ఎలివేట్‌కు హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌ను అందించే ఆలోచన లేదని హోండా ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలివేట్‌ ప్రారంభ ధర రూ.11.81 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఫేస్‌లిఫ్ట్‌ ధరలను అక్టోబర్‌ 6న ప్రకటించనున్నారు. కొత్త ఎలివేట్‌ మార్కెట్లో హ్యుందాయ్‌ క్రెటా తదితర మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీలతో నేరుగా పోటీపడనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper