Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్...

Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే టాప్ ఓటింగ్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ మాత్రమే. అతనితో పాటు ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చిన అమన్ కి కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ హౌస్ లో ఆశించిన స్థాయిలో అతని నుండి పెర్ఫార్మన్స్ రాకపోవడం తో, అతని గ్రాఫ్ బాగా డౌన్ అయ్యింది. రోహిత్ , […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే టాప్ ఓటింగ్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ మాత్రమే. అతనితో పాటు ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చిన అమన్ కి కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ హౌస్ లో ఆశించిన స్థాయిలో అతని నుండి పెర్ఫార్మన్స్ రాకపోవడం తో, అతని గ్రాఫ్ బాగా డౌన్ అయ్యింది. రోహిత్ , అమన్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే హౌస్ లోకి వచ్చిన తర్వాత వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అగ్ని పరీక్ష 2 టీం మొత్తానికి రోహిత్ లీడర్ అనే విధంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో రోహిత్ , అమన్ మధ్య చిన్నపాటి విబేధాలు ఏర్పడ్డాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ రెడ్ టీం మెంబెర్స్ అందరినీ కెప్టెన్సీ కంటెండర్స్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే రోహిత్ నుండి అమన్ రెండు డాగర్స్ ని తీసేస్తాడు. అమన్ కి ప్రతీ సందర్భం లోనూ అండగా నిలిచి , అతని కోసం పోరాటం చేస్తూ వచ్చిన రోహిత్ కి ఇది పెద్ద వెన్నుపోటు అనే చెప్పాలి. అయినప్పటికీ కూడా రోహిత్ అమన్ పై సీరియస్ అవ్వలేదు. ‘పర్వాలేదు.. ఎప్పటికైనా మనం ఇక్కడ పోటీ పడాల్సిందే. స్పోర్టివ్ గానే తీసుకుంటాను’ అని చెప్పాడు కానీ , రోహిత్ చాలా బాధ పడుతాడు. అంతే కాదు ఈ టాస్క్ లో రోహిత్ కి చాలా అన్యాయం జరిగింది. దీనిపై నెటిజెన్స్ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. లైవ్ లో జరిగింది కట్ చేయకుండా నేడు ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తే , రోహిత్ గ్రాఫ్ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే రోహిత్ 60 శాతానికి పైగా ఓటింగ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. అలాంటి రోహిత్ కి ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్ గా పడితే ఆయన గ్రాఫ్ కలలో కూడా ఊహించని రేంజ్ కి చేరుతుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ రాబోయే రోజుల్లో ఎంత అద్భుతంగా ఆడినా రోహిత్ ని అందుకోవడం అసాధ్యం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో హౌస్ లోని పరిణామాలు ఎలా మార్పు చెందుతాయి అనేది .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper