Devdutt Padikkal : శ్రీలంక జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఆటగాడు దేవదత్ పడికల్ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో ఇతడు సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. స్పిన్ బౌలింగ్ కు సహకరించే శ్రీలంక మైదానాల మీద స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక బౌలర్లు ఇబ్బంది పెట్టే బంతులు వేస్తున్నప్పటికీ.. తనను తాను నిగ్రహించుకున్నాడు. ఆడుతోంది తొలి సిరిస్ అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా పరిణతి చూపించాడు.
దేవదత్ తొలి టెస్టులో తొలి ఇనింగ్స్ లో 167 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 44 పరుగులు చేశాడు. రెండవ టెస్టులో ఈ కథనం రాసే సమయం వరకు 112 పరుగులు చేశాడు. 186 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్ లతో అదరగొట్టాడు. శ్రీలంక బౌలింగ్ మొత్తాన్ని ఒక ఆట ఆడుకున్నాడు.
ఈ మ్యాచ్లో జైస్వాల్ 45, కేఎల్ రాహుల్ 18, కెప్టెన్ గిల్ 50 పరుగులు చేశారు. రిషబ్ పంత్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా శ్రీలంక బౌలర్ల మీద ఎదురు దాడికి దిగాడు. 50 బంతుల్లో ఇతడు నాలుగు ఫోర్ల సహాయంతో 32* పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
37 పరుగులకే కేఎల్ రాహుల్ రూపంలో భారత జట్టు తొలివికెట్టు కోల్పోయింది. 66 బర్రెల వద్ద జేసు పాల రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. గిల్, దేవదత్ మూడో వికెట్ కు ఏకంగా 120 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ చేసి జోరు మీద కనిపించిన కెప్టెన్ గిల్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వెళ్ళిపోయాడు. రవీంద్ర జడేజా, దేవ దత్ నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 67 పరుగులు జోడించారు. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో రెండో టెస్ట్ వేదికను పూర్తి స్పిన్ బౌలింగ్ కు అనకూలంగా మార్చింది శ్రీలంక. కానీ భారత బ్యాటర్లు అంతకుమించి అనేస్థాయిలో బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక బౌలర్ల పప్పులు భారత బ్యాటర్ల ముందు ఉడక లేదు. భారత బ్యాటర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయడం విశేషం.