IND vs SL: టీమిండియా, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ నేటి నుంచి మొదలు కాబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ రేసులో ఉండాలంటే కచ్చితంగా టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ గెలవాలి. ప్రస్తుతం టీమిండియా డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు ఆతిధ్యం ఇస్తున్న శ్రీలంక ఆరవ స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత ముఖ్యం.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు అర్హత సాధించాలి అంటే కచ్చితంగా పాయింట్లు పట్టికలో మొదటి, రెండు స్థానాలలో నిలవాలి. ఒకవేళ ఈ సిరీస్ లో కనుక టీమిండియా విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అంతేకాదు తొలి రెండు స్థానాలలో ఉన్న జట్లతో అంతరాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకోగలుగుతుంది.
గాలే మైదానంలో తొలి టెస్ట్ జరుగుతుంది. గిల్ నాయకత్వంలో టీమిండియా శ్రీలంకను ఢీకొట్టబోతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆడుతున్న 600 టెస్ట్ ఇది. ఈ మైదానం స్పిన్ బౌలర్లకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. శ్రీలంక జట్టుతో వార్మప్ మ్యాచ్లో భారత ప్లేయర్ల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా చివరి ఓవర్ లో సిరాజ్ సాగించిన బ్యాటింగ్ పరాక్రమం అద్భుతంగా ఉంది. మన స్పిన్ బౌలర్లు కూడా దుమ్మురేపారు. టీమ్ ఇండియాకు జడేజా.. కులదీప్ యాదవ్ ప్రధాన బలం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన తొలి మ్యాచ్ లోనే ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో సిరాజ్ ప్రధాన బౌలర్గా రంగంలోకి దిగబోతున్నాడు
గాలే మైదానం సముద్ర తీరానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నిత్యం బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉంటాయి. దీనివల్ల బంతి ప్రాజెక్టు పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల స్పిన్ బౌలర్లు గాలిలోనే బంతిని మరింత వేగవంతంగా డ్రిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పుడు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్. రవీంద్ర జడేజా అద్భుతమైన పంతులు వేసి శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇక ఈ మ్యాచ్ మన కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. డిడి స్పోర్ట్స్ లో ఉచితంగా ఈ మ్యాచ్ ను వీక్షించవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ చానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఓటిటిలో అయితే సోనీ లీవ్ లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది.