Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలు ఏది చేసిన కరెక్ట్ , కామనర్స్ ఏది చేసిన తప్పు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున వీళ్ళు చేసే తప్పులను ఎట్టి చూపిస్తాడని భావిస్తే , ఆయన కూడా సెలబ్రిటీలకు మద్దతుగా మాట్లాడుతూ , అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఏ చిన్న తప్పు చేసినా భూతద్దం లో పెట్టి చూపిస్తున్నాడు. ఈ వారం అయితే సెలబ్రిటీలు ఎన్నో కుట్రలు చేశారు. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్ అయ్యాడు. కానీ ఒక్కరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్క్ లో లేడీ కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక పడవ లో నిల్చొని, పిల్లర్ పై తాడు విసిరి, దాని దగ్గరకు వెళ్లి తన టీం కి సంబంధించిన జెండా ని నాటాలి. ఈ టాస్క్ లో రెడ్ టీం రూల్స్ ని అనుసరిస్తూ గేమ్ ఆడారు. కానీ బ్లూ టీం కి సంబంధించిన దేబ్జాని మాత్రం రూల్స్ ని అనుసరించలేదు. తాడు ని ఉపయోగించకుండా , తన పడవని నెట్టుకుంటూ ముందుకు వెళ్లి తమ టీం జెండాలను నాటింది. దీన్ని సంచాలక్ త్రిగున్ అసలు పట్టించుకోలేదు. టీం వైపు పక్షపాతం చూపించాడు. రోహిత్ ఏ చిన్న తప్పు చేసినా రెచ్చిపోయి మాట్లాడే ప్రముఖ రివ్యూయర్స్ ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదు. పైగా దేబ్జాని బెంగాల్ టైగర్, త్రిగున్ బెస్ట్ సంచాలక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆడిన మొదటి టాస్క్ లో రూల్స్ ని అనుసరించలేదని స్వయంగా బిగ్ బాస్ కలగచేసుకొని మాట్లాడుతాడు.
కానీ ఎందుకు దేబ్జాని దొంగాట ఆడినప్పుడు పట్టించుకోలేదు. సెలబ్రిటీలకు ఒక న్యాయం , సామాన్యులకు మరో న్యాయమా?, సెలబ్రిటీలు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు వాళ్లనే తీసుకోవాల్సింది , ఈ మాత్రం దానికి అగ్ని పరీక్ష నిర్వహించడం ఎందుకు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క టాస్క్ లోనే కాదు త్రిగున్ సంచాలక్ గా వ్యవహరించిన ఈక్వేషన్స్ టాస్క్ లో కూడా దేబ్జాని కి కంటి సైగలతో క్లూలు ఇస్తాడు త్రిగున్ . ఇవన్నీ వీకెండ్ లో నాగార్జున వీడియోలు ప్లే చేసి త్రిగున్ ని నిలదీస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఈ వీకెండ్ కూడా సెలబ్రిటీలను వెనకేసుకొని వస్తే , ఇక ఈ షో ని చూడడం మానేస్తారు ఆడియన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.