Homeక్రీడలుక్రికెట్‌IND vs SL: శ్రీలంక కు కాదు.. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా..

IND vs SL: శ్రీలంక కు కాదు.. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా..

IND vs SL: ఏషియన్ గేమ్స్ లో టీమిండియా అద్భుతం సాధించింది. జపాన్ దేశంతో జరిగిన మ్యాచ్లో కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత తన అసలైన ఆట తీరు చూపించింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఎవరూ ఊహించని ఆట తీరు ప్రదర్శించింది. తద్వారా గోల్డ్ మెడల్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.. సెమి ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును గురించి పాకిస్తాన్ ఫైనల్లోకి వెళ్లిపోయింది. ఫైనల్ వెళ్లిపోయిన పాకిస్తాన్ జట్టుకు […]

IND vs SL: ఏషియన్ గేమ్స్ లో టీమిండియా అద్భుతం సాధించింది. జపాన్ దేశంతో జరిగిన మ్యాచ్లో కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత తన అసలైన ఆట తీరు చూపించింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఎవరూ ఊహించని ఆట తీరు ప్రదర్శించింది. తద్వారా గోల్డ్ మెడల్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది..

సెమి ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును గురించి పాకిస్తాన్ ఫైనల్లోకి వెళ్లిపోయింది. ఫైనల్ వెళ్లిపోయిన పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చే విధంగా టీమిండియా ఆడింది. శ్రీలంక జట్టుతో జరిగిన సమీఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఏకంగా 124 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సూర్య వంశీ 38 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. సంజు కూడా ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు మాత్రమే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. అక్షర పటేల్ 8 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 2.. శివం దుబే మూడు పరుగులు మాత్రమే చేయగలిగారు.

తోటి ప్లేయర్లు విఫలం అవుతున్నప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం అదరగొట్టాడు. కేవలం 46 బంతుల్లో నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సహాయంతో 80* పరుగులు చేశాడు. స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న మైదానం మీద తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ప్రతి బంతిని స్టాండ్స్ అవతలికి పంపించాలనే కసితో అతడు బ్యాటింగ్ చేశాడు. తద్వారా టీమిండియా ఏకంగా 169 పరుగులు చేసింది.

170 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన శ్రీలంక ఏ దశలో కూడా టీమ్ ఇండియాకు పోటీ ఇచ్చేలాగా కనిపించలేదు. జయవర్ధన, లసిత్.. సోహన్.. బండార.. బినురా ఇలా ఏకంగా ఐదుగురు ప్లేయర్లు 0 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. శ్రీలంక జట్టులో ఫెర్నాండో 15 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 9.5 ఓవర్లలో 45 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయం ద్వారా భారత్ ఫైనల్ లోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ జట్టు తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా గోల్డ్ మెడల్ సాధిస్తుంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక బ్యాటర్లు ఏ దశలో కూడా నిలబడలేకపోయారు. శ్రీలంక జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఏకంగా సున్నా పరుగులకు అవుట్ అయ్యారు.. ముగ్గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గోల్డ్ మెడల్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper