Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: దొంగ దారిలో 'బిగ్ బాస్ 10' కెప్టెన్ అయిపోయిన వర్షిణి.....

Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం!

Bigg Boss 10 Telugu:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది వర్షిణి నే. గత నాలుగైదు సీజన్స్ నుండి ఈమెని బిగ్ బాస్ టీం అడుగుతున్నారు. కానీ ఆమె రాలేదు , ఈ సీజన్ కి ఏరికోరి వచ్చింది. అయితే హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈమె తన మార్క్ గేమ్ ప్లే ని […]

Bigg Boss 10 Telugu:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది వర్షిణి నే. గత నాలుగైదు సీజన్స్ నుండి ఈమెని బిగ్ బాస్ టీం అడుగుతున్నారు. కానీ ఆమె రాలేదు , ఈ సీజన్ కి ఏరికోరి వచ్చింది. అయితే హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈమె తన మార్క్ గేమ్ ప్లే ని చూపించలేదు. ఇప్పటి వరకు ముకేశ్ తో లవ్ ట్రాక్ ని నడుపుతూ ఈమె గేమ్ సాగుతోంది. జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఈమెకు రోహిత్ తో పాటు , మిగిలిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అంటే చులకన అనే భావం నెటిజెన్స్ లో కలిగింది. ఇది ఆమె ఓటింగ్ పై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే నేటి ఎపిసోడ్ లో ఈమె చేసిన పని ఏదైతే ఉందో , అది ఈమెపై వేరే లెవెల్ నెగెటివిటీ ని పెంచే అవకాశాలు ఉన్నాయి.

అయితే నేడు జరిగే కెప్టెన్సీ టాస్క్ లో అమన్ గెలుస్తాడు. కానీ వర్షిణి తన వద్ద ఉన్నటువంటి స్టీలింగ్ పవర్ కీ ని ఉపయోగించి, అమన్ కి వచ్చిన కెప్టెన్సీ ని తన సొంతం చేసుకుంది. అలా 4 వ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా వర్షిణి నిల్చింది. పాపం అమన్ చాలా కష్టపడి గేమ్ ఆడి గెలిచినప్పటికీ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించినందుకు వర్షిణి కి అసలు కెప్టెన్సీ ఇవ్వకూడదు. బిగ్ బాస్ రూల్ ఏంటంటే తమకు వచ్చిన పవర్ కీస్ గురించి ఇతర కంటెస్టెంట్స్ తో చర్చించకూడదు. కానీ వర్షిణి తన పవర్ గురించి త్రిగున్ కి చెప్పేస్తుంది. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఏ చిన్న తప్పు చేసిన బేస్ వాయిస్ తో మందలించి శిక్షలు విధించే బిగ్ బాస్ , అతి ముఖ్యమైన రూల్ ని బయటపెట్టిన సెలబ్రిటీలపై నోరు కూడా మెదపలేదు.

ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున ఈ విషయం పై మాట్లాడి వర్షిణి కెప్టెన్సీ ని రద్దు చేసి , అమన్ కి తిరిగి ఇవ్వాలని సోషల్ మీడియా లో ఒక డిమాండ్ వినిపిస్తోంది. కానీ నాగార్జున నుండి అంత ఆశించి నిరాశ చెందడం వద్దు అని విశ్లేషకులు కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ప్రతీ వారం నాగార్జున ఇంట్లో జరిగే తప్పులను గట్టిగా ఎత్తి చూపిస్తాడని అనుకుంటారు నెటిజెన్స్ , కానీ ఆయన టార్గెట్ రోహిత్ మీదనే ఉంటుంది, అతను ఏమి చేసినా తప్పే, చివరికి గాలి పీల్చుకున్న తప్పే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు నాగార్జున అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ వారం అయినా సెలబ్రిటీలు చేసే తప్పులను ఎట్టి చూపిస్తాడో లేదో చూడాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper