Homeక్రీడలుక్రికెట్‌India vs New Zealand: చావు దెబ్బ నుంచి అద్భుత విజయానికి.. ఐదో వన్డేలో టీమ్...

India vs New Zealand: చావు దెబ్బ నుంచి అద్భుత విజయానికి.. ఐదో వన్డేలో టీమ్ ఇండియా పోరాటం వెనుక కథ ఇదే..

India vs New Zealand: కివీస్ గడ్డమీద భారత క్రికెట్ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. నాలుగో వన్డేలో ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటింగ్ పాలైంది. ఐదో వన్డేలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆడింది. బ్యాటింగ్ లో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ.. బౌలింగ్లో అదరగొట్టింది. ఆతిధ్య జట్టును 22 పరుగుల తేడాతో బోల్తా కొట్టించింది. 5 వన్డేల సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు మ్యాచ్లో ఎదురైన అవమానకరమైన […]

India vs New Zealand: కివీస్ గడ్డమీద భారత క్రికెట్ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. నాలుగో వన్డేలో ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటింగ్ పాలైంది. ఐదో వన్డేలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆడింది. బ్యాటింగ్ లో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ.. బౌలింగ్లో అదరగొట్టింది. ఆతిధ్య జట్టును 22 పరుగుల తేడాతో బోల్తా కొట్టించింది. 5 వన్డేల సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు మ్యాచ్లో ఎదురైన అవమానకరమైన ఓటమి నుంచి భారత జట్టు నేర్చుకున్న పాఠాలకు ఈ గెలుపు నిదర్శనం. రెండు మ్యాచ్లలో భారత జట్టు ఆటతీయులను పరిశీలిస్తే కొన్ని బలాలు.. బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నవంబర్ 13న జరిగిన నాలుగవ వన్డేలో భారత జట్టు ఆట తీరు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. యంగ్ 125 పరుగులు చేసి అదరగొట్టారు. సెఫర్డ్ 58 పరుగులు చేశాడు. అలెన్ 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాలలో భారత జట్టు వికెట్లు పడగొట్టినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయింది. 334 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ పేక మేడ లాగా కూలిపోయింది. హెన్రీ ఒకే ఓవర్ లో రోహిత్.. విరాట్.. అయ్యర్ ను వెనక్కి పంపించాడు. తద్వారా భారత జట్టు 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు పరుగులపరంగా ఇది రెండవ అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 244 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక నవంబర్ 15న జరిగిన చివరి వన్డేలో భారత్ కు మరోసారి అవే కష్టాలు ఎదురయ్యాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీద పేస్ బౌలర్లు దూకుడు చూపించారు. ఫలితంగా భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ 23 పరుగులకే వెనక్కి వెళ్లిపోయాడు. విరాట్.. గైక్వాడ్ సత్తా చూపించలేకపోయారు. ఒక దశలో 34 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగవ వన్డేలో ఎదురైన పరిస్థితులే మళ్లీ కనిపించాయి. అయితే ఈసారి భారత్ బ్యాటర్లు పూర్తిగా చేతులు ఎత్తెయ్యలేదు.

అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ భారత జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ 46 పరుగుల చొప్పున సాధించారు. అక్షర్ 58 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు.. ఒక సిక్సర్ ఉన్నాయి. కిషన్ కూడా 58 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు.. రెండు సిక్సర్లు కొట్టాడు. ముఖ్యంగా అక్షర్ ఇన్నింగ్స్ భారత జట్టుకు ఎంతో అత్యుత్తమమైనది. పరిస్థితులకు తగ్గట్టుగా అతడు బ్యాటింగ్ చేశాడు. నమన్ దీర్ 22 పరుగులు చేశాడు చివర్లో అర్ష్ దీప్ సింగ్, సిరాజ్ విలువైన పరుగులు జోడించారు. దీంతో భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

భారత జట్టు విజయంలో బౌలింగ్ కీలకపాత్ర పోషించింది. 210 పరుగుల లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ.. న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు అంతగా అవకాశం ఇవ్వలేదు . ప్రారంభం నుంచి కట్టదిట్టంగా బంతులు వేశారు. క్రికెట్లు పడగొట్టి బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచారు. న్యూజిలాండ్ జట్టులో యంగ్ 22 పరుగులు.. కెల్లి 24 పరుగులు చేశారు. ఫాక్స్ క్రాఫ్ట్ 31 పరుగులతో కాస్త అదరగొట్టాడు. బ్రేస్ వెల్.. శాంట్నర్ పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఒక దశలో న్యూజిలాండ్ జట్టు గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించినప్పటికీ.. భారత బౌలర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు. చివరకు న్యూజిలాండ్ జట్టు 48.1 పవర్లలో 187 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత జట్టు 22 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్లలో భారత జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల మూడో మ్యాచ్ రద్దయింది.. నాలుగో మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ భారీ విజయం అందుకుంది. ఐదో వన్డేలో భారత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తక్కువ స్కోరును కాపాడుకొని అదరగొట్టింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper