India vs New Zealand : భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ బ్యాటింగ్ మరోసారి బెంబేలెత్తిపోయింది. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ కు పరిమితమయ్యారు. మైదానం మీద ఉన్న తేమను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. పదునైన బంతులు వేసి న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో టీమ్ సెల్ ఫెర్ట్(38), మిచల్ (28), ఫిలిప్స్ (29*) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. టీమ్ ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్. అన్సుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ చెరి 2 వికెట్లు పడగొట్టారు. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆ తర్వాత ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది..
ఇప్పటికే భారత జట్టు టి20 సిరీస్ దక్కించుకుంది. వరుసగా మొదటి మూడు టి20 మ్యాచ్లను గెలుచుకుంది. మిగతా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా టీమ్ ఇండియా తొలి మ్యాచ్లో సత్తా చూపిస్తోంది. టి20 సిరీస్లో బ్యాటింగ్ కు అనుకూలించాయి న్యూజిలాండ్ మైదానాలు. అయితే వన్డే సిరీస్ లో మాత్రం అనూహ్యంగా బంతి స్వింగ్ అవుతోంది. పైగా తేమ కూడా అధికంగా ఉండడంతో బంతి మీద బౌలర్లకు సులభంగా గ్రిప్ లభిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు మైదానం మీద ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు.
న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకుంటే అదే గొప్ప అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రతి బంతి బ్యాట్ మీదికి కాకుండా.. వికెట్ల మీదికి దూసుకుపోతున్నాయి. బ్యాటర్లు ఎంత గట్టిగా కొట్టినా సరే బంతి గాల్లో లేస్తోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవడం దాదాపు అసాధ్యం. పైగా భారత బ్యాటర్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బౌలర్లు వారిని ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వన్డే సమరంలో న్యూజిలాండ్ జట్టు మీద టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే t20 సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా.. వన్డే సిరీస్ కూడా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. ఇక ఈ స్టోరీ రాసే సమయం వరకు 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.