Hardik Pandya:ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యా మరోసారి జాతీయ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు జాతీయ జట్టు తరఫున ఆడటం లేదు. కెరియర్ కూడా అంత గొప్పగా లేదు. ప్రేయసిని పెళ్లి కూడా చేసుకోవడం లేదు. మరి హార్థిక్ పాండ్యా ఎందుకు వార్తలలో వ్యక్తిగా నిలిచాడు.. ఏం చేశాడు.. ఏం జరిగిందంటే..
ఐపీఎల్ లో ముంబై జట్టుకు సారధిగా కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా. ముంబై జట్టుకు రావడం కంటే ముందు అతడు గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించాడు. గుజరాత్ జట్టు ఆడిన ఐపీఎల్ తొలి సీజన్లోనే విజేతగా నిలపాడు. ఆ తర్వాత సీజన్లో అతడు గుజరాత్ జట్టును రెండవ స్థానంలో నిలిపాడు.. అతడి నాయకత్వ పటిమను చూసిన ముంబై మేనేజ్మెంట్ గుజరాత్ నుంచి అతనిని కొనుగోలు చేసింది. అప్పటిదాకా నాయకుడిగా కొనసాగిన రోహిత్ శర్మను సాధారణ ఆటగాడి గానే పరిమితం చేసింది. ముంబై మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల హార్దిక్ పాండ్యా సారధిగా మారిపోయాడు. కానీ అతని నాయకత్వంగా ముంబై జట్టు ట్రోఫీ కాదు కదా.. చెప్పుకునే స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది.
హార్దిక్ ఆట తీరు పట్ల ముంబై జట్టు మేనేజ్మెంట్ సానుకూల దృక్పథంతో లేదు. అందువల్లే వచ్చే సీజన్లో అతడిని పక్కనపెట్టి.. కొత్త సారధిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ముంబై సారథి హార్దిక్ పాండ్యా వచ్చేసి సీజన్లో పంజాబ్ జట్టు తరఫున ఆడతాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి పంజాబ్.. ముంబై యాజమాన్యాలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ముంబై జట్టులోకి వెళ్తాడని తెలుస్తోంది. అయితే హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడి పంజాబ్ జట్టుకు వెళ్తుండగా.. అర్ష్ దీప్ సింగ్ పంజాబ్ జట్టు నుంచి ముంబైకి వస్తున్నాడు. అయితే ఈ ఆటగాళ్ల మార్పిడికి సంబంధించిన అనుమతి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇవ్వాల్సి ఉంది. బిసిసిఐ నిర్ణయం కోసం రెండు జట్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో హార్దిక్.. అర్ష్ దీప్ సింగ్ కు సంబంధించిన ఆర్థిక ఒప్పందం ఎంత అనేది ఇంకా బయటికి తెలియ రాలేదు. ఎన్ని కోట్ల రూపాయలకు ఈ ఆటగాళ్ల మార్పిడి జరుగుతుందనే వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.