Homeక్రీడలుHarry Brook : బ్రూక్ విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,4,6,6,6.. బిత్తర పోయిన టీమిండియా...

Harry Brook : బ్రూక్ విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,4,6,6,6.. బిత్తర పోయిన టీమిండియా బౌలర్..

Harry Brook : అది మామూలు కొట్టుడు కాదు.. విధ్వంసం అనే మాట కూడా సరిపోదు. వీర విహారం చేశాడు. మరొకసారి బంతిని పట్టుకోవాలంటేనే బౌలర్ కు వెన్నులో వణుకు పుట్టేలా చేశాడు. రెండు వికెట్లు సాధించిన ఆనందాన్ని జస్ట్ ఐదు బంతుల వ్యవధిలో ఆవిరి చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా బౌలర్ కు కన్నీరు మిగిల్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ […]

Harry Brook : అది మామూలు కొట్టుడు కాదు.. విధ్వంసం అనే మాట కూడా సరిపోదు. వీర విహారం చేశాడు. మరొకసారి బంతిని పట్టుకోవాలంటేనే బౌలర్ కు వెన్నులో వణుకు పుట్టేలా చేశాడు. రెండు వికెట్లు సాధించిన ఆనందాన్ని జస్ట్ ఐదు బంతుల వ్యవధిలో ఆవిరి చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా బౌలర్ కు కన్నీరు మిగిల్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

ముందుగా ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కిషన్ 49, అభిషేక్ శర్మ 43, అయ్యర్ 37 పరుగులతో ఆకట్టుకున్నారు. చివర్లో తిలక్ వర్మ 24 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కరణ్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆర్చర్, జాక్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు.. 0 పరుగుల వద్ద ఓపెనర్ సాల్టికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. వీరిద్దరూ సున్నా పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం విశేషం. ఈ ఇద్దరి వికెట్లను అర్ష్ దీప్ సింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక్కడితో టీమ్ ఇండియా గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వన్ డౌన్ ఆటగాడు బ్రూక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అతడు కేవలం 13 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి.

ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ వేసిన ఓవర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు..అర్ష్ దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి బెతల్ బ్రూక్ కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే బ్రూక్ శివతాండవం చేశాడు. రెండో బంతి కి ఫోర్ కొట్టాడు. మూడో బంతిని కూడా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత మూడు బంతులను వరుసగా సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 27 పరుగులు వచ్చాయి. ఫలితంగా మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రెండు వికెట్లు పడగొట్టి కాలర్ ఎగరేసిన అర్ష్ దీప్ సింగ్ ఈ ఓవర్ తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అసలు బ్రూక్ అలా ఆడుతుంటే వైవిధ్యవంతమైన బంతులు వేయాల్సిన అర్ష్ దీప్ సింగ్ లూజ్ డెలివరీలు వేశాడు. దీంతో బ్రూక్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper