Homeఆధ్యాత్మికంTemple Pradakshina : దేవాలయాల్లో సరైన ఫలితం కోసం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

Temple Pradakshina : దేవాలయాల్లో సరైన ఫలితం కోసం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

Temple Pradakshina : భారతదేశంలో పురాతన చరిత్రను కలిగిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలకు ఇప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో కొత్తగా ఆలయాలను నిర్మిస్తున్నారు. అయితే ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ఎన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? హిందూ ధార్మిక సాంప్రదాయంలో ఆలయంలో ప్రదక్షిణలు చేయడం పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. […]

Temple Pradakshina : భారతదేశంలో పురాతన చరిత్రను కలిగిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలకు ఇప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో కొత్తగా ఆలయాలను నిర్మిస్తున్నారు. అయితే ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ఎన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

హిందూ ధార్మిక సాంప్రదాయంలో ఆలయంలో ప్రదక్షిణలు చేయడం పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. భగవంతుడు మన జీవితానికి కేంద్రంగా భావిస్తున్నామని భావనను కలిగించడానికి కొందరు పండితులు చెబుతుంటారు. మనలోని అహంకారం, స్వార్థం, సత్ప్రవర్తన నిర్మించాలని సంకల్పానికి కూడా ఈ ప్రదక్షిణలు చేస్తారని చెబుతున్నారు.

అయితే ఆలయంలో మూడు, 5, 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు ఒక ప్రదక్షిణనే చేస్తారు. పురాణాల విశ్వాసాల ప్రకారం ఆలయంలో ఒక ప్రదక్షిణ చేయడం ద్వారా ఈ జన్మలో మనిషి తెలిసి తెలియని చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అలాగే రెండు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ జన్మతో పాటు గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కొన్ని పురాణాలు తెలుపుతున్నాయి. మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల జన్మజన్మల్లో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. మూడు అనే సామెతకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక అర్థముంది. త్రిమూర్తులు, మూడు కాలాలు ఉండడంవల్ల మూడు ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతారు. అలాగే శత్రు బాధలు ఉన్నవారు కూడా ఐదు ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఐశ్వర్యం కలగాలని కోరుకునేవారు ఆలయంలో ఏడు ప్రదక్షణలు చేయాలని చెబుతారు. సంపద, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం కూడా ఈ ప్రదక్షిణాలు ఫలిస్తాయని అంటుంటారు.

కొందరు తమ కోరిక నెరవేర్చాలని దేవుడని ప్రార్థిస్తారు. ఇదే సమయంలో ఆ ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల సరైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేసి కోరిక కోరితే తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు ఉంటాయని హిందూ పురాణాల్లో చెప్పబడుతుంది..

ఈ విధంగా జీవితం మొత్తంలో కోటి ప్రదక్షణలు చేస్తే మోక్షం లభించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేశామన్నది కాకుండా.. ఇంత భక్తితో చేస్తున్నామనేది ముఖ్యం. ఎందుకంటే కొందరు మనసులో ఒక ఆలోచన ఉంచుకొని.. మరో ఆలోచనతో దేవుడని కొలవడం వల్ల ప్రదక్షిణలకు ఫలితం ఉండదని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper