Agni Pariksha 2: ఏ ముహూర్తం లో ‘అగ్ని పరీక్ష 2’ ని మొదలు పెట్టారో తెలియదు కానీ , ఈ షో పై ఏర్పడినంత నెగెటివిటీ, ఇప్పటి వరకు ఏ షో మీద ఏర్పడలేదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా జ్యూరీ కంటెస్టెంట్స్ కి నిర్వహించే టాస్కులు, వాళ్ళతో వ్యవహరించే తీరు పట్ల సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాల కోసం వచ్చారు కదా అని మరీ ఇంతలా టార్చర్ చెయ్యాలా? , ఇది చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోనీ కష్టపడి గేమ్స్ ఆడిన వాళ్ళని ముందుకు పొనిస్తున్నారా అంటే అది కూడా లేదు. అందుకు ఉదాహరణ గా నేటి ఎపిసోడ్ నిల్చింది. గాయత్రి అనే అమ్మాయిని రికమండేషన్ కోటాలో ‘బిగ్ బాస్ 10’ లోకి పంపేందుకు టీం చాలా కష్టపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈరోజుటి ఎపిసోడ్ లో నిర్వహించిన టాస్కులో ఆమె ఆడలేక మధ్యలోనే వదిలేసింది. రోహిత్ , గాయత్రీ, జోష్నా లకు క్లిప్పుల టాస్క్ ఒకటి పెడుతారు. ఈ టాస్క్ లో ఎవరైతే తమ శరీరం పై ఎక్కువ క్లిప్పులు పెట్టుకొని ఉంటారో, వాళ్ళు గెలిచినట్టు. జోష్నా ఈ టాస్క్ లో 73 క్లిప్పులను తన శరీరం పై ఉంచుకుంటుంది, అదే విధంగా రోహిత్ నాయుడు అయితే ఏకంగా 109 క్లిప్పులను ఉంచుకుంటాడు. కానీ గాయత్రీ మాత్రం టాస్క్ మధ్యలోనే ఆమ్మో నా వల్ల కాదంటూ వెళ్ళిపోతుంది. కానీ జడ్జీలు ఆమెని టాప్ 15 లోకి పంపించారు. అద్భుతంగా టాస్కులు ఆడిన సుమ, రుచిత , జోష్న లను ఎలిమినేట్ చేశారు. ముఖ్యంగా సుమ కి అయితే ఘోరమైన అన్యాయం చేశారు జడ్జీలు. ఎందుకంటే ఈమె ఇద్దరు మగవాళ్ళతో పోరాడింది.
‘జోలో చిప్స్’ ఎంత ఘాటుగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఉదాహరణకు పచ్చి మిర్చి ఘాటు 5000 యూనిట్లు ఉంటే , జోలో చిప్స్ ఘాటు 8 నుండి 10 లక్షల యూనిట్స్ రేంజ్ లో ఉంటుంది. ఈమె వాటిని ఇద్దరు మగవాళ్ళతో సమానంగా తినడమే కాదు, బెలూన్స్ కూడా వాళ్ళకంటే వేగంగా ఊది పగలగొట్టింది. ఒకానొక సమయం లో ఆమె గెలుస్తుందని కూడా అంత అనుకున్నారు. అలాంటి పోటీ ఇచ్చిన అమ్మాయిని ఎలిమినేట్ చేసి, ఆరంభం లోనే పారిపోయిన గాయత్రీ ని టాప్ 15 లోకి పంపడం ఏంటి?. అంతే కాదు , రీసెంట్ గా జరిగిన కొత్త ఎపిసోడ్స్ షూటింగ్స్ లో కూడా గాయత్రీ ఒక్కటంటే ఒక్క టాస్క్ లో కూడా గెలవలేదట. ఇక చివరికి టాప్ 15 లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి కంటెస్టెంట్ కూడా ఈమెనే. ఈమెని పుష్ చేయడానికి బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నం చేసింది కానీ , ఆమె ముందుకు వెళ్లలేకపోయింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.