Homeఅంతర్జాతీయంPAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్తాన్ ఇంత పని చేసింది

PAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్తాన్ ఇంత పని చేసింది

PAK vs BAN: క్రికెట్లో పాకిస్తాన్ ఆట తీరు గురించి అందరికీ తెలుసు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. ఒక్కోసారి ఆస్ట్రేలియా మీద గెలుస్తుంది.. అదే సమయంలో జింబాబ్వే మీద ఓడిపోతుంది. ప్రత్యర్థి ప్లేయర్ల మీద ఎదురుదాడి చేయాల్సిన పాకిస్తాన్ ప్లేయర్లు.. డ్రెస్సింగ్ రూమ్లో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇలా ప్రతి సందర్భంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఆశ్చర్యాన్ని కళ్ళ ముందు ఉంచుతారు. ఏషియన్ గేమ్స్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు […]

PAK vs BAN: క్రికెట్లో పాకిస్తాన్ ఆట తీరు గురించి అందరికీ తెలుసు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. ఒక్కోసారి ఆస్ట్రేలియా మీద గెలుస్తుంది.. అదే సమయంలో జింబాబ్వే మీద ఓడిపోతుంది. ప్రత్యర్థి ప్లేయర్ల మీద ఎదురుదాడి చేయాల్సిన పాకిస్తాన్ ప్లేయర్లు.. డ్రెస్సింగ్ రూమ్లో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇలా ప్రతి సందర్భంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఆశ్చర్యాన్ని కళ్ళ ముందు ఉంచుతారు.

ఏషియన్ గేమ్స్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. ఫైనల్ లోకి ప్రవేశించే ఈ పోటీలో పాకిస్తాన్ మొత్తానికి విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఓవర్లను వర్షం వల్ల కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 టికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.. బంగ్లాదేశ్ జట్టులో హృదోయ్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో మొకిం మూడు వికెట్లు పడగొట్టాడు. మిన్హాస్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. 20 పరుగుల వద్ద రెండో వికెట్ చేజార్చుకుంది. 21 పరుగుల వద్ద మూడో వికెట్.. 45 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది.హృదోయ్ దూకుడు వల్ల ఐదో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం లభించినప్పటికీ.. మళ్లీ పాకిస్తాన్ బౌలర్లు సత్తా చూపించడంతో బంగ్లాదేశ్ కథ 111 పరుగుల వద్ద ముగిసింది.

అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగుల వద్ద రెండో వికెట్.. 38 పరుగుల వద్ద మూడో వికెట్.. 53 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే నవాజ్ (27*), సమద్ (30*) పరుగులు చేయడంతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని 11.3 ఓవర్లలో పూర్తి చేసింది. ఈ విజయం ద్వారా పాకిస్తాన్ ఫైనల్లోకి వెళ్లిపోయింది.. మరో సెమి ఫైనల్ మ్యాచ్లో ఇండియా, శ్రీలంక పోటీ పడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ లోకి వెళ్తుంది. గోల్డ్ మెడల్ కోసం పాకిస్తాన్ జట్టుతో పోటీ పడుతుంది. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్ లో టీమిండియా అదరగొట్టింది. శ్రీలంక మీద గెలిచి ఫైనల్లోకి వెళితే.. అప్పుడు పాకిస్తాన్.. భారత్ మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో భారత్ మీద పాకిస్తాన్ గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. పాకిస్తాన్ జట్టు మీద భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అందువల్ల భారత్ ఫైనల్ వెళ్ళిపోవడం.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారత ప్లేయర్లు జోరు మీద ఉన్నారని.. వారిని నిలువరించడం శ్రీలంక వల్ల.. పాకిస్తాన్ వల్ల కాదని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఫైనల్ పోటీలోకి ప్రవేశించి.. పాకిస్తాన్ జట్టును ఓడించి.. గోల్డ్ మెడల్ దక్కించుకోవాలని అభిమానులు భారత ప్లేయర్లను సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper