Karthika Deepam: అత్యంత పవిత్ర మాసంగా కార్తీక మాసంను పేర్కొంటారు. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారు. కార్తీక మాసంలో దీపానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ఒక దీపం లో అనేక రకాల దేవతలు కొలువై ఉంటారని.. స్వచ్ఛమైన మనసుతో దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల శుభాలు జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే ఈ దీపం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కొన్ని వస్తువులతో ఈ దీపంను వెలిగించోద్దని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏవి?
సాధారణంగా మనం దీపం అనగానే ఏం చేస్తాం? ఒక దీపాంతలో నూనె పోసి వత్తులు వేస్తారు. ఆ తర్వాత అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. అయితే వందల కొద్ది లేదా వేల కొద్ది దీపాలు ఉంటే కొందరు కొవ్వొత్తులతో దీపాలను వెలిగిస్తారు. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం అగ్గిపుల్లతో గాని.. కొవ్వొత్తులతో గాని దీపాలను అస్సలు వెలిగించద్దని అంటున్నారు. కొవ్వొత్తులతో దీపాలను వెలిగించడం వల్ల అవి అపవిత్రం అవుతాయని అంటున్నారు. కొవ్వొత్తులను చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచేస్తారు. వీటితో దీపాలు వెలిగించడం ఏమాత్రం శ్రేష్టం కాదు అని అంటున్నారు. అలాగే అగ్గిపుల్లతో దీపం వెలిగించడం కూడా శుభప్రదం కాదని చెబుతున్నారు. మరి దీపంలో దేనితో వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీక మాసంలో కొందరు ఒకే దీపం పెడతారు. కానీ ఆలయాల్లో.. నది తీరంలో చాలావరకు దీపాలను వెలిగిస్తారు. ఇలా దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో కాకుండా ఒక అగర్బత్తిని వెలిగించాలి. ఈ అగర్బత్తితో దీపాలను వెలిగించడం వల్ల ఎంతో మంచిది. ఎందుకంటే అగర్బత్తిలో సువాసనమైన పదార్థం ఉంటుంది. సాధారణంగానే మనం దేవుని వద్ద అగర్బత్తీలను వెలిగిస్తాం. అలా వెలిగించే ముందు వీటితో దీపాలు వెలిగించడం వల్ల కూడా సకల దేవతలు సంతోషిస్తారని పండితులు తెలుపుతున్నారు. అయితే దీపం వెలిగించే సమయంలో మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా శ్రేష్టమైన మనసుతో ఉండాలి. ఎందుకంటే ఒక దీపం మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకొని వెలిగిస్తే ఆ దేవతలు అనుగ్రహిస్తారని అంటారు. అంతేకాకుండా దీపాన్ని వెలిగించిన తర్వాత అందులో కొన్ని అక్షింతలు వేయాలి. అలా వేసి దామోదరాయ నమః అంటూ నామస్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.
అంతేకాకుండా కార్తీకదీపం వెలిగించే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉదయం కంటే సాయంత్రం ఆలయాల్లో లేదా ఇంట్లో శ్రేష్టమైన మనసుతో దీపాలు వెలిగించడం వల్ల దైవానుగ్రహం ఉండే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అలాగే ఈ దీపాలను వెలిగించి ఆలయాల్లో దానం ఇవ్వడం వల్ల కూడా అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంది.