Toli Ekadashi 2025 : తెలుగు వారి మొదటి పండుగ తొలి ఏకాదశి. దీన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా పిలవగా మరికొందరు పేలాల పండుగ అని అంటారు. అయితే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడని అందుకే ఈ ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఏకాదశి తిథి శనివారం రోజు జులై 5వ తేదీన ప్రారంభమై 6వ తేదీన పూర్తి అవుతుంది. కాబట్టి జులై 6వ తేదీన ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఆదివారం రోజు అనగా ఏకాదశి నాడు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజ నిర్వహించాలి. ఈ సమయంలో నిర్వహించడం వల్ల మంచి జరుగుతుందని, అనుకున్న పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయని, ప్రతీ పనిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే ఈ శుద్ధ ఏకాదశి నాడు మహా విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కుంటాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తల స్నానం చేసి మహా విష్ణువును పూజించి రోజంతా ఉపవాసం ఉండాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పువ్వులు, తులసి దళాలతో పూజించాలి. పులిహోర, కొబ్బరికాయ, అరటి పండ్లు వంటివి నైవేద్యంగా పెట్టాలి.
మహా విష్ణువుకి ఇష్టమైన ఈ ఏకాదశి నాడు తెలిసో తెలియక అసలు తప్పులు చేయకూడదు. వీటివల్ల ఉన్న పాపాలు ఇంకా పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ప్రస్తు్తం కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు ఈ ఏకాదశి నాడు కూడా నాన్‌వెజ్ తింటారు. తొలి ఏకాదశి నాడు నాన్‌వెజ్ తినడం వల్ల పాపాలు పెరిగిపోతాయని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు నాన్‌వెజ్ తినకూడదని చెబుతున్నారు. వీటితో పాటు మసాలా, ఉల్లిపాయ, మందు వంటివి కూడా తీసుకోకూడదని పండితులు అంటున్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం విష్ణువుకు నచ్చదు. దీనివల్ల అంత నష్టం కలిగిస్తాడు. ఏ పని కూడా సరిగ్గా జరగదు. అన్ని విధాలుగా ఆటంకం ఏర్పడుతుంది. అయితే తొలి ఏకాదశి నాడు ప్రతీ ఒక్కరూ కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. వేకువ జామున నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి విష్ణువుని పూజించాలి. అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి ఆకులతో పూజలు నిర్వహించాలి. ముఖ్యమైన తొలి ఏకాదశి నాడు తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి. అయితే తులసి ఆకులను మాల చేసి విష్ణు మూర్తికి సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. కేవలం ఏకాదశి నాడు మాత్రమే ఎప్పుడైనా కూడా ఇలా దేవుడికి సమర్పించడం వల్ల పాపాలు తొలగి అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా రుణ బాధలు తొలగిపోయి.. అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.