Homeఆధ్యాత్మికంtemple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆలయంలో ఇలా ప్రదక్షణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? వీటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ప్రదక్షిణ అనే పదంలోని ఒక ప్రత్యేకమైన భావం ఉంది. మన కుడి వైపు నుంచి ఒక కేంద్ర […]

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆలయంలో ఇలా ప్రదక్షణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? వీటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

ప్రదక్షిణ అనే పదంలోని ఒక ప్రత్యేకమైన భావం ఉంది. మన కుడి వైపు నుంచి ఒక కేంద్ర బిందువును ఆధారం చేసుకుని చుట్టూ తిరగడాన్నే ప్రదక్షిణగా భావిస్తారు. మన జీవితానికి దేవుడే కేంద్ర బిందువు అని భావించేవారు విగ్రహం ఉన్నచోట కేంద్ర బిందువుగా చేసుకొని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఇలా ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

హిందూ శాస్త్రం ప్రకారం దేవాలయంలో గర్భగుడి ప్రత్యేకమైనది. ఈ గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు ఎన్నో మంత్రోచ్ఛరణాలు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ విగ్రహాలతో పాటు ఆలయం కూడా ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందని భావిస్తారు. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైన శక్తితో కూడిన వాతావరణం ఉంటుందని చెబుతారు. అయితే మనుషులు ఈ దేవాలయం చుట్టూ తిరగడం వల్ల ఆశక్తిలో కొంతైనా తమలో వస్తుందని భావించి ఇలా ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం పురాతన కాలంలోనే మొదలు పెట్టారని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది.

గుడిలో ప్రదక్షిణలు చేయడం వల్ల మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. భక్తులు కాసేపు దేవుడిని స్మరిస్తూ నడవడం వల్ల లేదా శ్లోకాలు పటిస్తూ తిరగడం వల్ల వారి మనసు ప్రశాంతంగా మారుతుంది. అప్పటివరకు జీవితంలో ఎన్నో ఒత్తిడిలు లేదా కష్టాలను ఎదుర్కొన్న మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రదక్షిణను ఒక ధ్యాన ప్రక్రియల భావించి నెమ్మదిగా చేస్తే మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందని చెబుతూ ఉంటారు.

ఈ ప్రదక్షిణలతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దేవాలయంలో సాధారణంగానే ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది. ఇలాంటి వాతావరణం లో కాసేపు నడవడం వల్ల శరీరానికి తేలికపాటి వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మిగతా ప్రదేశాల్లో కంటే ఇక్కడ మంచి మనసుతో నడుస్తూ ఉంటారు. దీంతో ఎలాంటి కల్మషం లేని ఆలోచనలు ఉత్పన్నమవుతాయని అంటారు.

సాధారణంగా గుడి చుట్టూ 3 లేదా 5 సార్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఇంతకు మించి ఉంటాయి. వీటిలో ప్రధానంగా నవగ్రహాల చుట్టూ 9, రావిచెట్టు చుట్టూ 21, జమ్మి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇవే కాకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా పరిష్కారామయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper