Toll Plaza Local Pass: జాతీయ రహదారులపై ప్రయాణం చేసినప్పుడు టోల్ ప్లాజాలు తరచూ తగులుతూ ఉంటాయి. ఈ టోల్ ప్లాజా లో ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే టోల్ ప్లాజా 20 కిలోమీటర్ల లోపు ఉన్న స్థానికులు పదేపదే వెళ్లాల్సి వస్తే ఇప్పటివరకు అత్యధిక చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. వీరి కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజిటల్ లోకల్ పాస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లోకల్ పాస్ ద్వారా నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ఎన్నిసార్లు అయినా టోల్ ప్లాజా నుంచి ప్రయాణం చేయవచ్చు. అయితే దీనిని ఎలా పొందాలంటే?
ఉదాహరణకు టోల్ ప్లాజా వద్ద ఉన్న ఒక గ్రామానికి చెందిన వారు తమ వాహనం ద్వారా మరో ప్రాంతానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో పదేపదే చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అయితే 20 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నవారు రూ.350 చెల్లిస్తే ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. ఈ టోల్ ప్లాజా ను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు.
ఇప్పటికే fastag వంటి సౌకర్యాలను రాజ్ మార్క్ యాత్ర యాప్ ద్వారా పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన లోకల్ పాస్ ను సైతం ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే పొందవచ్చు. అయితే ఈ లోకల్ పాస్ పొందాలంటే ముందుగా డిజి లాకర్ లో అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలి. ఆ తర్వాత రాజ్ మార్క్ యాప్ లోకి వెళ్లి సరైన వివరాలు అందిస్తే అప్పుడు డిజీ లాకర్ లో ఉన్న పత్రాలను అడుగుతుంది. అప్పుడు ఆ పత్రాలు అందిస్తే వెరిఫై చేసి లోకల్ పాస్ ను అందిస్తుంది.
ఈ లోకల్ పాస్ తీసుకున్న తర్వాత నెలపాటు ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. దీంతో వినియోగదారులకు ఎంతో సౌలభ్యం కలిగి ఉంది. అయితే ఇది కేవలం 20 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల వారికి మాత్రమే వర్తిస్తుంది. అందుకోసం సరైన సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు వర్తించదు.