Flydubai flight incident: ఫ్లై దుబాయ్ కంపెనీలో విమానాన్ని నడుపుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ మీద ఒమన్ దేశానికి చెందిన కో పైలట్ దాడి చేసిన విషయం తెలిసిందే. కత్తితో అతడిని పొడిచాడు. అతడు తీవ్రంగా గాయపరుస్తున్నప్పటికీ పైలట్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా విమానాన్ని ముందుకు పోనిచ్చాడు. విమానం తలకిందులు అవుతున్నప్పటికీ అతడు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా తోటి ప్రయాణికుల ప్రాణాలను అతని కాపాడాడు.
విమానం తలకిందులు కావడం.. అప్పటికే అది సౌదీ అరేబియా గగన తలం మీద ఉంది. అప్పటికే దాని నుంచి అత్యవసర పరిస్థితి (కోడ్ 7700) అంటూ తబుక్ విమానాశ్రయానికి సంకేతం వచ్చింది. మరికొద్ది నిమిషాల్లోనే కోడ్ 7500 (హైజాక్) అంటూ సందేశం అందింది. ఈ సందేశంతో తీవ్ర కలకలం నెలకొంది. ఇజ్రాయిల్ దేశం మీద ఉగ్రదాడి జరుగుతుందని ప్రచారం మొదలైంది. పైగా విమానంలో ప్రయాణిస్తున్న మెజారిటీ ప్రయాణికులు ఇజ్రాయిల్ దేశానికి చెందినవారు. దీంతో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి.. రక్షణ మంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు.
అప్పటికే కత్తితో దాడి చేసిన కో పైలట్ ను పైలట్.. ప్రయాణికులు పట్టుకున్నారు. తీవ్ర గాయాలైన పైలెట్ కు విమానంలో ఉన్న ఒక వైద్యుడు ప్రాథమికంగా చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రయాణికులలో ఇద్దరు ఇతర విమాన పైలట్ల సహాయంతో అభిమానాన్ని కిందికి మళ్లించారు. ఆ తర్వాత కోడ్ ను హైజాక్ నుంచి సాధారణ అత్యవసర పరిస్థితి (7700) కి మార్చారు.
పైలట్ పై దాడికి పాల్పడి.. విమానాన్ని కూల్చాలి అనుకున్న ఒమన్ కో పైలెట్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్, ఒమన్ దేశాల మధ్య అంతగా సంబంధాలు లేవు. దీనికి తోడు అరబ్, గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయిల్ వచ్చే విమానాల మీద తీవ్రస్థాయిలో పరిశీలన ఉంటుంది. అలాంటిది ఇజ్రాయిల్ దేశానికి వెళ్లే విమానంలో పైలట్ గా ఒమన్ జాతీయుడిని ఎలా అనుమతించారు అనే విషయం మీద అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయిల్ రవాణా శాఖ మంత్రి కూడా ఈ వే సందేహాలను వ్యక్తం చేశారు. విమానం కూల్చడానికి ముందుగానే ప్రణాళిక రూపొందించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఒమన్ కో పైలట్ అసలు ఉద్దేశం ఏంటి.. అతని ప్రణాళిక ఏంటి.. దాడికి ఎందుకు ప్రయత్నించాడు అనే అంశాల మీద ఇంతవరకు క్లారిటీ లేదు. ఇతర వెనుక ఎవరైనా ఉన్నారా.. అందుకోసమే ఇదంతా చేశాడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
పైలట్ మీద కత్తి దాడి జరిగిన తర్వాత విమానం తలకిందులుగా ప్రయాణించడం మొదలుపెట్టింది. కేవలం 29 సెకండ్ల కాలంలో 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఏకంగా 17 అడుగులకు దిగింది. దాదాపు 14 అడుగుల మేర నిలువుగా కిందికి దిగింది. ఆ తర్వాత 19 వేల అడుగులకు చేరుకుంది. ప్రయాణ మార్గాన్ని పూర్తిగా మార్చుకుంది. జోర్డాన్ సరిహద్దుల సమీపంలో అసాధారణమైన రీతిలో తిరిగింది. మళ్లీ వెనక్కి వెళ్ళింది. గంట తర్వాత సౌదీ అరేబియాలోని తబూకు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.