Sudigali Sudheer: బుల్లితెర సెలబ్రిటీల్లో అందరికంటే ఎక్కువ క్రేజ్, ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన , ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో గా నటిస్తూ ఫుల్ బిజీ అయిన సుడిగాలి సుధీర్, ఇప్పుడు యాంకర్ గా కూడా రాణిస్తున్నాడు. అయితే బుల్లితెర పై ఆయన ప్రముఖ యాంకర్ రష్మీ తో నడిపిన లవ్ ట్రాక్ ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నారని ఎవరికైనా అనిపించక తప్పదు.
కానీ మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని , అవసరం ఉన్నప్పుడు తప్ప , కనీసం మేము ఫోన్ లో కూడా మాట్లాడుకోమని సుధీర్ అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు. రష్మీ కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాత్రమే బుల్లితెర పై లవ్ ట్రాక్ నడుపుతున్నాము కానీ , మా మధ్య ఏమి లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియా లో గత కొన్ని రోజుల నుండి ప్రచారం అవుతున్న వార్త ఏమిటంటే, సుధీర్ కి ఈమధ్యనే రహస్యంగా పెళ్లి అయిపోయిందని, పెళ్లి కూతురు మరెవరో కూడా దీపికా పిల్లి అంటూ ప్రచారం సాగింది. ఈ రూమర్ ప్రచారం లోకి రావడానికి ముఖ్య కారణం గతం లో దీపికా పిల్లి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక స్టోరీ నే అని తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే , విదేశాల్లో ఉన్నప్పుడు, సుడిగాలి సుధీర్ తో కలిసి దిగిన ఒక ప్రైవేట్ ఫోటో ని స్టోరీ లో అప్లోడ్ చేస్తూ, సుధీర్ ని ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్ పెడుతుంది దీపికా. ఇది సోషల్ మీడియా లో క్షణాల వ్యవధిలో బాగా వైరల్ అయిపోవడం తో, ఆ స్టోరీ ని డిలీట్ చేసింది. తన అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసారని, ఇంతకు ముందు అప్లోడ్ చేసిన స్టోరీ నాది కాదంటూ చెప్పుకొచ్చింది దీపికా. కానీ ఆమె చెప్పిన మాటలను నెటిజెన్స్ నమ్మలేదు. కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుందని బలంగా నమ్మారు.
గత మూడేళ్ళ నుండి సుధీర్ , దీపికా పిల్లి రిలేషన్ లో ఉన్నారని, వీళ్లిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉందని , రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్. గతం లో వీళ్ళిద్దరూ కలిసి ‘ఢీ’ షో లో చేశారు. ఆ తర్వాత ఆహా మీడియా లో ఒక కామెడీ షో కి యాంకర్స్ గా కూడా వ్యవహరించారు. అలా వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కానీ ఇది ప్రేమ , పెళ్లి వరకు దారి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక కెరీర్ విషయానికి వస్తే సుధీర్ హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపడితే , దీపికా హీరోయిన్ గా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గానే ఈమె యాంకర్ ప్రదీప్ తో కలిసి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే చిత్రం కూడా చేసింది.
చూసేందుకు చాలా అందంగా ఉంటుంది కానీ , ఎందుకో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం ఈమెకు రావడం లేదు. ‘ఢీ’ షో లో ఈమెని చూసినప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉందని అనిపించింది. ఆ షో తర్వాత ఈమె ఈటీవీ లో మరో షో లో కనిపించలేదు. మంచి టాలెంట్, అందం ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాకపోవడం తో ఈమె కెరీర్ ఊహించిన రేంజ్ కి వెళ్ళలేదు అని చెప్పొచ్చు. ఇక సుధీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన హైలెస్సో, జోకర్ వంటి చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. గాలోడు చిత్రం తో హీరో గా తొలిసారి ఇండస్ట్రీ లో సక్సెస్ ని అందుకున్న సుధీర్,భవిష్యత్తులో కూడా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే సుధీర్ , దీపికా రిలేషన్ పై మీ అభిప్రాయం ఏమిటి?, నిజంగానే వీళ్ళు రహస్యం గా పెళ్లి చేసుకున్నారని మీరు నమ్ముతున్నారా?, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.