Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఏ లో గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిగున్ మాత్రమే. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఈయన నుండి విపరీతమైన కంటెంట్ వస్తూనే ఉంది. ఆ కారణం చేత రేటింగ్స్ కూడా బాగా వస్తుండడం తో అక్కినేని నాగార్జున కూడా ఇతనికి పెద్దగా కోటింగ్ ఇవ్వడం లేదు. కానీ ఇకపై త్రిగున్ ని కంట్రోల్ చేయకపోతే షో రిస్క్ లో పడే అవకాశం ఉంది. అతను భవిష్యత్తులో ఇంకా హద్దులు దాటే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వారం నాగార్జున కచ్చితంగా అతన్ని కంట్రోల్ లో పెట్టాల్సిందే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ వారం లో త్రిగున్ చేసిన తప్పులకు కోటింగ్ ఇవ్వాలంటే ఒకరోజు సరిపోదు, కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ముందుగా ఆయన రోహిత్ ని ఆడంగి అంటూ దుర్భాషలాడుతూ దూషించాడు. ఇక నిన్న జరిగిన టాస్క్ లో అమన్ ని ‘L..కొడకా’ అని దూషించాడు. అయితే త్రిగున్ అభిమానులు మాత్రం కావాలని మా వాడిని టార్గెట్ చేస్తున్నారు, అసలు ఆయన ఆ పదాన్ని ఉపయోగించలేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆధారాలతో సహా బయాపెట్టారు. స్లో మోషన్ లో త్రిగున్ అన్న మాటలను చూపిస్తూ అప్లోడ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో లో త్రిగున్ ‘L’ అంటూ మొదలు పెడుతాడు. కానీ ఆ పదాన్ని పూర్తి చేయడు.
అంటే ఆయన ఉద్దేశ్యం ఆ పదాన్ని ఉపయోగించాలనే అనేది స్పష్టమైంది. ఒకవేళ త్రిగున్ ఆ పదాన్ని ఉపయోగించకపోయుంటే , స్టార్ మా ఛానల్ టీం కి బీప్ ని ఉపయోగించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిగున్ ప్రవర్తించిన ఈ తీరుకి కచ్చితంగా రెడ్ కార్డు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి నాగార్జున అతనికి రెడ్ కార్డు ఇస్తాడా?, లేదా ఎప్పటి లాగానే బుజ్జగించి వదిలేస్తాడా అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.
Trigun L word ‼️
#BiggBossTelugu10 https://t.co/Lh19bN0beG
— LEO (@ShihTzuFanss) September 30, 2026