Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఒకరిని మించి ఒకరు చిల్లర గా ప్రవర్తిస్తున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి ‘అగ్ని పరీక్ష’ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులు అంటే చాలా చులకన అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. గత సీజన్ లో కూడా ఇలాంటి చులకన భావం సెలబ్రిటీస్ లో ఉండేది. కానీ కనీసం నటించేవారు , ఈ సీజన్ లో అలాంటివి లేవు. మొదటి వారం త్రిగున్ రోహిత్ ని ‘నీలాగా నేను అగ్ని పరీక్ష షో నుండి వచ్చానని అనుకున్నావా?’ అంటూ చులకన చేసి మాట్లాడుతాడు. నాగార్జున ఏ అంశంపై చాలా గట్టిగా కోటింగ్ ఇస్తాడని అనుకున్నారు కానీ , కనీసం దాని ప్రస్తావన కూడా తీసుకొని రాకపోవడం గమనార్హం.
ఇక ఈ వారం సుధీర్ రెడ్డి కూడా ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చామని అనుకుంటున్నావా?, తోపు సెలబ్రిటీలు మేము అన్నట్టుగా కామెంట్స్ చేస్తాడు. సుధీర్ దగ్గర నుండి ఇలాంటి కామెంట్స్ ఎవ్వరూ ఊహించలేదు. ఇది విన్న తర్వాత ఇతని పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయం మారిపోయింది. గత వారం ఈయన సంపాదించుకున్న పాజిటివిటీ మొత్తం ఈ ఒక్క మాటతో గంగలో కలిసిపోయింది అని చెప్పొచ్చు. ఒకసారి కాదు , రెండు సార్లు ‘అగ్ని పరీక్ష ‘ గేమ్ ని కించపరచడం ఈ షో లో జరిగింది, నాగార్జున ఈ వారం కచ్చితంగా ఈ అంశం ని ప్రస్తావిస్తూ సుధీర్ కి కోటింగ్ ఇవ్వాలి, లేని పక్షం లో ఈ షోలో రాబోయే రోజుల్లో ఇంకా తగ్గించి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మరి నాగార్జున ఈ అంశాన్ని ప్రస్తావిస్తాడా?, లేదా ఎప్పటి లాగానే వదిలేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ఈ వారం హౌస్ మేట్స్ అందరూ చేసిన తప్పులకు కోటింగ్ ఇవ్వాలని అనుకుంటే , ఆదివారం ఎపిసోడ్ కూడా ఫైర్ మీద ఉంటుంది. అంతటి కంటెంట్ ఉంది , నాగార్జున నుండి ఆడియన్స్ చాలా ఆశిస్తున్నారు, మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని , ఒకరిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఒకరిని ఎలిమినేట్ చేస్తారని, మరొక ఎలిమినేషన్ రెడ్ కార్డు ద్వారా ఉంటుందని , ఆ రెడ్ కార్డు ద్వారా ఎలిమినేట్ అయ్యేది త్రిగున్ అని అంటున్నారు.