Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 'ది ప్యారడైజ్' మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇవేమి...

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇవేమి వసూళ్లు సామీ!

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా పిలవబడే వాళ్ళు కూడా , […]

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా పిలవబడే వాళ్ళు కూడా , ఈమధ్య కాలం లో టాక్ రాకపోతే వసూళ్లను రాబట్టలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోల లీగ్ లో ఉన్నటువంటి నాని భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, 90 శాతం కి పైగా రీకవరీ ని అందుకోవడం సాధారణమైన విషయం కాదు. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి వారం లో 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. వారం రోజుల్లో 2 కోట్ల రూపాయిల లాభం వచ్చింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 40 కోట్ల షేర్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సీడెడ్ నుండి 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఉత్తరాంధ్ర నుండి 6 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 3 కోట్ల 70 లేఖలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 89 లక్షలు , గుంటూరు నుండి 3 కోట్ల 40 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 2 కోట్ల 85 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 1 కోటి 75 లక్షల రూపాయిలను రాబట్టింది.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్లు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్లు , ఓవర్సీస్ నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 157 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం డీసెంట్ హోల్డ్ ని కనబరిస్తే 200 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper