Bigg Boss 7 Telugu: ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా దాన్ని.. శోభ వ్యక్తిగత జీవితంపై శివాజీ షాకింగ్ కామెంట్స్

అమర్-ప్రశాంత్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అమర్ తన చేయి కొరికాడని సంచాలక్ శోభకు ప్రశాంత్ కంప్లైంట్ చేశాడు. నాకు తెలియదు అది మీరిద్దరూ చూసుకోండని శోభ తప్పుకుంది. ఆ రోజు అమర్ ప్రశాంత్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా దాన్ని.. శోభ వ్యక్తిగత జీవితంపై శివాజీ షాకింగ్ కామెంట్స్

Follow us on

Bigg Boss 7 Telugu: మొదటి నుండి సీరియల్ బ్యాచ్ తో శివాజీకి గొడవలే. అమర్, శోభ, ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడుతున్నారని పసిగట్టిన శివాజీ తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. పల్లవి ప్రశాంత్, యావర్ లతో స్పై బ్యాచ్ ఫార్మ్ చేశాడు. నామినేషన్స్ లో, టాస్క్ లలో స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. షో చివరి దశకు చేరుకుంది. అర్జున్ మినహాయిస్తే… హౌస్లో ఉన్న ఆరుగురు ఈ రెండు గ్రూప్స్ కి చెందినవారే. దీంతో హౌస్లో వాతావరణం హీటెక్కుతోంది.

ఓ టాస్క్ లో అమర్-ప్రశాంత్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అమర్ తన చేయి కొరికాడని సంచాలక్ శోభకు ప్రశాంత్ కంప్లైంట్ చేశాడు. నాకు తెలియదు అది మీరిద్దరూ చూసుకోండని శోభ తప్పుకుంది. ఆ రోజు అమర్ ప్రశాంత్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో పాటు నెట్టుకుంటూ మెడికల్ రూమ్ కి వద్దకు తీసుకుపోయాడు. అమర్ ప్రవర్తన చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.

ఇదే టాస్క్ లో చివరికి ప్రియాంక,అర్జున్, శివాజీ మిగిలారు. సంచాలక్ గా ఉన్న శోభ… కాన్సంట్రేట్ ప్రియాంక అని పదే పదే అంటూ ఆమెను ఎంకరేజ్ చేసింది. శివాజీ చిరాకుగా నేను ఆడనని బయటకు వచ్చేశాడు. యావర్ ఎంత బ్రతిమిలాడినా వినలేదు. సంచనాలక్ గా ఉండి నువ్వు ఒకరిని ఎలా సపోర్ట్ చేస్తావ్… అని శివాజీ ప్రశ్నించాడు. అది నా ఇష్టం అని శోభ తిరిగి సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

గొడవ ముగిశాక శివాజీ కొన్ని మాటలు జారాడు. ఆవేశంలో శోభ వ్యక్తిగత జీవితం గురించి ఇతర కంటెస్టెంట్స్ వద్ద మాట్లాడారు. శోభ ప్రవర్తన దారుణంగా ఉంది. ఈ బిహేవియర్ చూసి ఆ కుర్రాడు భయపడడా? పెళ్లి ఎలా చేసుకుంటాడు. అది చిన్న పిల్ల. మా ఇంట్లో ఆడపిల్ల అయితే లాకి ఒకటి కొట్టేవాడిని అన్నాడు. శోభ ఎంత ఇరిటేట్ చేసినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు