Senior Heroines : ఇండస్ట్రీలో ఈ సీనియర్ హీరోయిన్ల హవా నడుస్తోందిగా…

కానీ కొందరు హీరోయిన్ లు మాత్రమే ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కొత్త హీరోయిన్ లకు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్ లకు సైతం షాకిస్తూ ఈ హీరోయిన్ ల హవా కొనసాగుతుంది. మరి ఆ హీరోయిన్ లు ఎవరో ఓ సారి చూసేద్దాం..

  • Written By: NARESH
  • Published On:
Senior Heroines : ఇండస్ట్రీలో ఈ సీనియర్ హీరోయిన్ల హవా నడుస్తోందిగా…

Follow us on

Senior Heroines : ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లకు ఇప్పుడు మళ్లీ అవకాశాలు రావడం కష్టమే. అందం, ఫిట్ నెస్ రెండు కలగలిపిన కొత్త హీరోయిన్ లు ఎంట్రీ ఇవ్వడంతో.. సీనియర్ లకు పెద్దగా అవకాశాలు ఉండడం లేదు. కొందరు సైడ్ క్యారెక్టర్ తో సర్దుకొని పోతున్నారు. సీనియర్ హీరోయిన్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సిందే. కానీ కొందరు హీరోయిన్ లు మాత్రమే ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కొత్త హీరోయిన్ లకు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్ లకు సైతం షాకిస్తూ ఈ హీరోయిన్ ల హవా కొనసాగుతుంది. మరి ఆ హీరోయిన్ లు ఎవరో ఓ సారి చూసేద్దాం..

నయనతార.. నయన్ రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్న ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పటికీ తగ్గడం లేదు. స్టార్ హీరోలకు జోడిగా నటిస్తున్న ఈ బ్యూటీ వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం నటిస్తున్నారు. ఈ సంవత్సరం జవాన్ సినిమాతో హిట్ అందుకున్న నయన్ కు తమిళంలో ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయట.

అనుష్క… మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విజయం అందుకున్న తర్వాత అనుష్క క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ప్రస్తుతం చిరంజీవి వశిష్ట కాంబో సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

త్రిష.. పొన్నియన్ సెల్వన్ 2, లియో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు త్రిష రేంజ్ ను పెంచాయని చెప్పాలి. దీంతో బాలయ్య, బాబీ కాంబోలో రానున్న సినిమాలో నటించడానికి సిద్దమవుతుందట ఈ బ్యూటీ.

కాజల్ అగర్వాల్.. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు భారతీయుడు 2, సత్యభామ సినిమాలతో కూడా అలరించడానికి సిద్దమవుతుంది బ్యూటీ. మరో సీనియర్ శ్రియ సైతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె చేతిలో కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఉన్నాయట. ఇక ఈ హీరోయిన్ ల హవా మరికొన్ని సంవత్సరాల పాటు కూడా కొనసాగనుంది.

 

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు