Mistake Movie: ప్రస్తుతం పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటే ఆడియన్స్ పెద్ద సినిమాలనే కాకుండా, చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. ఇదే కోవలో రీసెంట్ గా వచ్చిన రామ్ అసుర్ సినిమా అందుకు ఉదాహరణ. వైవిధ్య కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో హీరోగానూ, ప్రొడ్యూసర్ గానూ సక్సెస్ అందుకున్నాడు అభినవ్ సర్దార్. ఇప్పుడు తాజాగా స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించిన “మిస్టేక్” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ హీరో. సన్నీ కోమలపాటి దర్శకత్వంలో తెరకెకిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: స్పైడర్ మ్యాన్ సినిమాపై పుష్పరాజ్ ఏమన్నారంటే?
అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని మొదటి పాట ‘గంటా గ్రహచారం’ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సంపాదించుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ మూవీ లోని రెండవ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్ . గుంటూరులోని వివిఐటి కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధుల నడుమ ఈ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పాట కోసం సుమారు 40మంది లిల్లీపుట్స్ ను సేకరించినట్లు చిత్ర బృందం తెలిపారు. జంగిల్ థీమ్ తో ఆకట్టుకుంటోన్న ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, సుజిత్ కుమార్, కరిష్మా కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: సమంతతో చైతన్య విడిపోడానికి కారణం ఇదేనా?.. వైరల్గా చై రీసెంట్ ఇంటర్వ్యూ
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Second song released from mistake movie and goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com