Nayantara : ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార(Nayanathara). కేవలం సౌత్ లోనే కాకుండా, నార్త్ ఇండియా లో కూడా ఈమెకు వీరాభిమానులు ఉన్నారు. నయనతార ఒక సినిమాలో ఉంది అని తెలిస్తే చాలు, హీరో ఎవరో కూడా చూడకుండా థియేటర్స్ కి క్యూలు కడుతారు. అలాంటి క్రేజ్ ఉంది కాబట్టే ఆమెని అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు ఎవరికీ పడితే వాళ్లకు ఇచ్చేది కాదు. ఆమె ఎన్ని వైవిద్యభరితమైన పాత్రలు చేసుంటే ఈ రేంజ్ అభిమానం ఆమె సొంతం అయ్యుంటాది?, కేవలం హీరోల పక్కన హీరోయిన్ గా నటించి, పాటల్లో డ్యాన్స్ వేసి వెళ్లిపోయే హీరోయిన్ కాదు ఆమె. బాగా గమనిస్తే ఆమె చేసిన ప్రతీ సినిమా ఆమె నటనని బయటకు తీసిన సినిమాలే. అలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే ఆమె ఒక సినిమాకు సంతకం చేస్తుంది.
అలా రెగ్యులర్ హీరోయిన్ గా తన మార్కు ని చూపించుకున్న నయనతార, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. అందుకే అభిమానులు, దర్శక నిర్మాతలతో పాటు, ట్రేడ్ కూడా ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. అయితే ఇక నుండి తనని అలా పిలవొద్దు అంటూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక లేఖని విడుదల చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మీరంతా నాపై ఎంతో అభిమానం చూపిస్తూ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. అందుకు నేను కృతజ్ఞురాలిని. ఆ ప్రేమకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ నన్ను నయనతార అని పిలిస్తేనే ఆనందం. లేడీ సూపర్ స్టార్ లాంటి పేర్లు వెలకట్టలేనివి. మీరు ఆ బిరుదు తో పిలుస్తుండడం వల్ల నాకు కంఫర్ట్ గా లేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
నయనతార అనే పేరు నా హృదయానికి దగ్గరైనది అని, ఆ పేరు నన్ను ఒక నటిగా గుర్తించడమే కాకుండా, వ్యక్తిగా తానేంటో తెలియచేస్తుందని, సినిమా మన అందరినీ ఐక్యంగా ఉంచుతుందని, దానిని ఎప్పుడూ అలా సెలెబ్రేట్ చేసుకుందామని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరి నయనతార చెప్పినట్టు అభిమానులు పాటిస్తారా లేదా అనేది చూడాలి. ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు అందరూ ఇలాగే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్(Dy CM Pawan Kalyan) తన పేరు నుండి పవర్ స్టార్ ని తొలగించేసాడు. ఈమధ్య విడుదల అవుతున్న ఆయన సినిమాలన్నిట్లో పవర్ స్టార్ టైటిల్ పడడం లేదు. అదే విధంగా తమిళ హీరో అజిత్(Thala Ajith Kumar) తనని తల అని పిలవొద్దు అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేసాడు. ఇలా అభిన్నులు ప్రేమగా పిలుచుకునే టైటిల్స్ కి హీరోలు అడ్డు చెప్పడం పై సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : హోటల్ లో నయనతార..పట్టించుకోని జనం..క్యూ లైన్లో గంటల తరబడి వెయిటింగ్..వైరల్ అవుతున్న వీడియో!