Srikanth Odela and Chiranjeevi : దసర(Dasara) సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆయన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు నానితో ‘ది ప్యారడైజ్’ (The Paradaise) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అండర్ వరల్డ్ మాఫియా డాన్ కథతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి నాని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవితో చేస్తున్న సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ లెవెల్ ప్రజెంటేషన్ ని చూపించబోతున్నాడట… ఇక ఈ సినిమాకి దాదాపు 200 కోట్లకు పైన బడ్జెట్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయట. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపు దక్కుతుందని అటు దర్శకుడు, ఇటు హీరో భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…
ఇక ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi)కి కథని ఫైనల్ చేసి చెప్పిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాని వచ్చే సంవత్సరం నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం ఇద్దరూ కూడా ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్లు కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నమైతే చేస్తున్నారట.
మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా రాబోతుంది అంటే యావత్ సినిమా ప్రేక్షకులందరిలో భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది.
కాబట్టి చిరంజీవితో సినిమాని హ్యాండిల్ చేసే కెపాసిటీ శ్రీకాంత్ కి ఉందని ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఒకవేళ ప్యారడైజ్ సినిమాని కనక నెక్స్ట్ లెవెల్లో నిలపగలిగితే మాత్రం ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని అతనికి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి రక్తంతో తడిపేశారు..ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందా..?