OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న సినిమా ‘ఓజీ'(They Call Him OG). సుజిత్(Director Sujeeth) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా విధి విర్వహణల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్, ఓజీ తో పాటు ప్రస్తుతం తన చేతిలో ఉన్న మూడు సినిమాలకు డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని పూర్తి చేయడానికి కేవలం నాలుగు రోజుల డేట్స్ కావాల్సి ఉంది, అదే విధంగా ‘ఓజీ’ ని పూర్తి చేయడానికి 21 రోజుల డేట్స్ కావాలి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ‘హరి హర వీరమల్లు’ బ్యాలన్స్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను మంగళగిరి లో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు.
Also Read : #RC16 లోకి కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ..లుక్ టెస్ట్ పూర్తి..అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానున్నాయి. కానీ ఓజీ చిత్రానికి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఓజీ చిత్రానికి ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ నేపథ్యం లో తెరకెక్కుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా వరకు నెగటివ్ షేడ్ లోనే కనిపిస్తాడు. ఆయుధాలను అక్రమంగా జపాన్ కి స్మగ్లింగ్ చేసే డాన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి పాత్రలు చేస్తే జనాలు ఒప్పుకుంటారా?, యూత్ ఆడియన్స్ కచ్చితంగా ఇలాంటి సినిమాలను ఈమధ్య కాలంలో ఒక రేంజ్ లో ఆదరిస్తున్నారు, కానీ ఓజీ విడుదల సమయానికి వివాదాలు ఎక్కువ ఉంటాయేమో అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే వాడు మనకి హీరో అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.
ప్రతిపక్షాలు అదే అంశంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పై రివర్స్ లో కౌంటర్లు వేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అందరి లాగా సాధారణ హీరో అయితే అసలు సమస్యే ఉండదు. కానీ ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా ఉన్నాడు, దేశవ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి పేరు కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంత వయొలెంట్ యాక్షన్ మూవీ ని జనాలు ఎలా తీసుకుంటారో అని భయపడుతున్నారు అభిమానులు. పైగా పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పోలీసుల చేతులను నరికే సన్నివేశాలు కూడా ఇందులో ఉంటాయట. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి ప్రోత్సహిస్తే రియాక్షన్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి విచిత్రమైన టైటిల్ ని ప్రకటించిన దిల్ రాజు..షాక్ లో ఫ్యాన్స్!